Hyderabad: హైదరాబాదులో అత్యంత ధనవంతుడుగా ఉన్న తెలుగు తేజం గురించి మనందరం తెలుసుకోవాల్సిందే. ఈ బిలియనీర్ ప్రఖ్యాత ఐఐటీ, ఐఐఎంలలో అస్సలు చదువుకోలేదు కూడా.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది దివీస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు మురళీ దివి గురించి. ఆయన హైదరాబాద్‌లో అత్యంత ధనవంతుడు, ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన శాస్త్రవేత్తల్లో ఒకరు. ఫోర్బ్స్ ప్రకారం మురళీ దివి నికర విలువ దాదాపు రూ.53,000 కోట్లుగా ఉంది. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాల(API) తయారీలో దివీస్ ల్యాబ్స్ టాప్-3 కంపెనీల్లో ఒకటిగా ఉంది. కంపెనీ మార్కెట్ క్యాప్ సైతం రూ.97,476 కోట్లుగా ఉంది.

ఆంధ్రప్రదేశ్ లోని చిన్న పట్టణం నుంచి వచ్చిన దివి మురళీ తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. మురళీ తన 12వ తరగతిలో రెండు సార్లు ఫెయిల్ అయ్యారు. అయినప్పటికీ ఆశ కోల్పోలేదు. అలా 1976లో తన 25 ఏళ్ల వయస్సులో అమెరికాకు వెళ్లి ఫార్మసిస్ట్‌గా పని చేయడం ప్రారంభించారు. అమెరికా వెళ్లినప్పుడు అతని చేతిలో కేవలం రూ.500 మాత్రమే ఉన్నాయని ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. అక్కడ ట్రినిటీ కెమికల్స్, ఫైక్ కెమికల్స్ వంటి కంపెనీల్లో ఆయన పని చేసి ఏడాదికి 65,000 డాలర్లను సంపాదించారు.
అలా ఇండియాకు తిరిగి వచ్చాక.. మురళీ దివి 1990లో దివీస్ లాబొరేటరీస్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకునే ముందు 6 సంవత్సరాలు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌లో పనిచేశారు. 1984లో మురళీ దివి కల్లం అంజి రెడ్డితో చేతులు కలిపి కెమినార్‌ను నిర్మించారు. దీనిని 2000లో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్‌లో విలీనం చేశారు. సొంత కంపెనీ పెట్టాక ప్రారంభంలో దివీస్ ల్యాబ్స్ APIలు, ఇంటర్మీడియట్‌ల తయారీకి వాణిజ్య ప్రక్రియలను అభివృద్ధి చేసే వ్యాపారంలోకి ప్రవేశించింది.
1995లో మురళీ దివి తెలంగాణాలోని చౌటుప్పల్ ప్రాంతంలో తన మొదటి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 2002లో అతను విశాఖపట్నం సమీపంలో రెండవ తయారీ యుటిలిటీని ప్రారంభించారు. హైదరాబాద్‌కు చెందిన దివీస్ లాబొరేటరీస్ మార్చి 2022లో రూ.88 బిలియన్ల ఆదాయాన్ని నివేదించింది. మురళీ దివి MIT మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత మురళీ దివి కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ కోర్సు పూర్తి చేశారు.


Click it and Unblock the Notifications