RedBus Story: స్టార్టప్ కంపెనీలు అనగానే వాటిలో ఎంత రిస్క్ ఉంటుందో చూసేవారికి కనిపించదు. ఆలోచన దగ్గర నుంచి ఫండింగ్ వరకు అనేక అంశాలు ఇందులో ముడిపడి ఉంటాయి. ఇంత చేసిన చివరికి దానిని ప్రజలు అంగీకరించకుంటే ఫెయిల్ అవుతుంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది రెడ్‌బస్ స్టార్టప్ సక్సెస్ స్టోరీ గురించే. ప్రస్తుతం దేశంలో స్టార్టప్ కంపెనీల హవా నడుస్తోందని చెప్పుకోవాలి. 2006లో రెడ్‌బస్ ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ సంస్థ ప్రారంభమైంది. దీనిని ఫణీంద్ర సామ, సుధాకర్ పసుపునూరి, చరణ్ పద్మరాజు అనే యువకులు ప్రారంభించారు. వీరు ముగ్గురూ బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో గ్రాడ్యుయేట్లు. రెడ్‌బస్‌ను ప్రారంభించే ముందు చాలా కంపెనీల్లో పనిచేశారు.

అయితే సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచనతో రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టి రెడ్ బస్ కంపెనీని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.6,985 కోట్లకు చేరుకుంది. ఆన్‌లైన్‌లో బస్ టికెట్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్న ఫణీంద్ర సామ ఆలోచన నుంచి పుట్టిందే రెడ్ బస్. వీరి నాయకత్వంలో దేశంలో బస్సు టిక్కెట్ల బుకింగ్‌లో అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయి.
కంపెనీ పొందిన మెుదటి పెట్టుబడి ఒక మిలియన్ డాలర్లు. ఇది కంపెనీని కొత్త శిఖరాలకు చేర్చేందుకు దోహదపడింది. 2013లో రెడ్ బస్‌ను దక్షిణాఫ్రికాకు చెందిన నాస్పర్స్, చైనాకు చెందిన టెన్సెంట్ జాయింట్ వెంచర్ అయిన ఇబిబో గ్రూప్ కొనుగోలు చేసింది. కంపెనీని రూ.828 కోట్లకు విక్రయించారు. ఆ తర్వాత కూడా ఫణీంద్ర సామా రెడ్‌బస్ అభివృద్ధికి అనేక పనులు చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్‌గా పనిచేశారు. తెలంగాణ ప్రభుత్వం కోసం వివిధ వినూత్న సాంకేతిక ప్రాజెక్టులను అభివృద్ధి చేశారు. కష్టపడితే ఏదైనా సాధించొచ్చనటానికి ఇదే సరైన నిదర్శనం.


Click it and Unblock the Notifications