Success Story: ఐఏఎస్ అధికారి కావాలనేది చాలా మందికి జీవిత కల. దీనికి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో నిర్వహించే యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణం కావాల్సి ఉంటుంది. అయితే దీనిని వీడి మారుతీ సుజుకీ ఇండిగా ఛైర్మన్‌గా ఉన్న ఆర్‌సి భార్గవ గురించి తెలుసుకుందాం.
IAS అధికారిగా సుదీర్ఘ కెరీర్ తర్వాత.. 1956లో యూపీఎస్సీ పరీక్షలో తన బ్యాచ్‌లో టాపర్‌గా నిలిచారు భార్గవ. ఆ తర్వాత 1981లో మారుతీ మార్కెటింగ్ డైరెక్టర్ గా చేరారు. అప్పటి నుంచి వివిధ పాత్రల్లో ఆ సంస్థలో కొనసాగుతున్నారు. 2007 నుంచి భారతదేశంలో అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారుని ఛైర్మన్‌గా ఉన్నారు. ఆగస్టు 29 నాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,90,000 కోట్లుగా ఉండగా.. మంగళవారం కంపెనీ షేరు ధర రూ.9,622.30 వద్ద ఉంది.

భార్గవ అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి గణితశాస్త్రంలో మాస్టర్ ఆఫ్ సైన్సెస్ పట్టా పొందారు. ఆ తర్వాత అమెరికాలోని విలియమ్స్ కాలేజీ నుంచి డెవలప్‌మెంటల్ ఎకనామిక్స్‌లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశారు. పాఠశాల విద్యను డూన్ స్కూల్‌లో చదివారు. మారుతిలో చేరడానికి ముందు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లో డైరెక్టర్ (కమర్షియల్)గా ఉన్నారు.
IAS అధికారిగా 1974-77 మధ్య భారత ప్రభుత్వం, ఇంధన మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. అలాగే 1977-78 మధ్య భారత ప్రభుత్వంలోని క్యాబినెట్ సెక్రటేరియట్‌లో జాయింట్ సెక్రటరీగా కూడా పనిచేశారు. 2016లో దేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను అందుకున్నారు.


Click it and Unblock the Notifications