Ravindra Metkar Story: నేటి తరంలో చాలా మంది తమకు ఇష్టమైన వ్యాపారాలను ప్రారంభించేందుకు ఉద్యోగాలను సైతం మానేస్తున్నారు. అయితే వీరిని అటుగా నడిపిస్తోంది చాలా మంది సక్సెస్ స్టోరీలే. వాస్తవానికి పదుల సంవత్సరాల కృషి దానికి వెనుక ఉన్నదన్న విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి. ఒకప్పుడు రూపాయి సంపాదన కోసం ఎన్నో కష్టాలు పడిన వ్యక్తులు ప్రస్తుతం లక్షలు కోట్లు సంపాదిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది రవీంద్ర మెట్కర్ సక్సెస్ స్టోరీ గురించే. ఆయన తన 16వ ఏటనే సంపాదన కోసం వేట మెుదలెట్టాడు. వాస్తవానికి మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో జన్మించిన రవీంద్ర కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులతో సతమతమైంది. తండ్రి ప్యూన్‌గా పనిచేస్తుండగా, ముగ్గురు తోబుట్టువులతో కుటుంబం ఆర్థికంగా సతమతమైంది. దీంతో చిన్న వయస్సులోనే పౌల్ట్రీ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. కోళ్ల పెంపకంలో విజయం సాధించిన 55 ఏళ్ల రవీంద్ర ఈ ప్రయాణంలో అనేక ఒడిదొడుకులు, ఎత్తుపల్లాలను చూశారు. అయితే కోళ్ల పెంపకంలోకి అడుగుపెట్టకముందు మందుల షాపులో రోజుకు రూ.5 వేతనానికి పనిచేశాడు.

ఆర్థికంగా కష్టాలు ఉన్నప్పటికీ విద్యను కొనసాగించాడు. కాలేజీకి వెళ్లటానికి కనీసం సైకిల్ కూడా కొనలేని స్థితిలో నడుచుకుంటూనే వెళ్లేవాడు. అయితే ఈ క్రమంలో తనకు తెలిసినవారు పౌల్ట్రీ వ్యాపారంలోకి అడుగుపెట్టి విజయాలను చూడటంతో తాను సైతం ప్రేరణ పొందాడు. అలా మెుదటి పెట్టుబడి కోసం తండ్రి ప్రావిడెంట్ ఫండ్ నుంచి రూ.3000 తీసుకుని 1984లో కోళ్ల పెంపకం ప్రారంభించాడు. ఆ సమయంలో కేవలం 100 కోళ్లతో చిన్న షెడ్డులో వ్యాపారం ప్రారంభించి తన కృషిని మాత్రం తగ్గించకుండా ముందుకు సాగాడు. 1992లో కామర్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేశాడు. దీనితో పాటు కోళ్ల సంఖ్యను 400కి పెంచాడు.
నిరంతరం పరిశ్రమను కొనసాగించిన రవీంద్ర అమరావతిలో ఎకరం పొలం బ్యాంకు రుణంతో కొనుగోలు చేశాడు. అలా 4 వేల కోళ్ల ఫారాన్ని నిర్మించాడు. అలా ఆ సంఖ్యను తర్వాతి కాలంలో 12,000 కోళ్లకు, 2006 నాటికి కోళ్లకు పెంచుకుంటూ పోయాడు. అయితే ఈ క్రమంలో ఇండియాలో కొత్తగా వచ్చిన బర్డ్ ఫ్లూ వల్ల పౌల్ట్రీ వ్యాపారం భారీగా దెబ్బతింది. ఈ క్రమంలో తన వద్ద ఉన్న 16000 కోళ్లను నష్టానికి అమ్ముకోవాల్సి వచ్చింది.

దీని తర్వాత 2008లో రవీంద్ర రూ.25 లక్షలు అప్పు చేసి ఈ సారి 20,000 లేయర్ కోళ్లతో గుడ్ల ఫారమ్ తిరిగి ప్రారంభించాడు. అక్కడి నుంచి వెనుకకు తిరగని రవీంద్ర ప్రస్తుతం 50 ఎకాల విస్త్రీర్ణంలో దాదపు 2 లక్షల వరకు కోళ్లను పెంచుతున్నారు. రోజూ రూ.60,000, ఏడాదికి రూ.15 కోట్ల వరకు వ్యాపారం ద్వారా సంపాదిస్తున్నాడు. అలా తన వ్యాపార చెతురతతో నేటి తరం యువతకు ఆదర్శవంతమైన వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు. వాస్తవానికి ఇది ఆరోజుల్లోనే ఒక స్టార్టప్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుత స్థాయిని చేరుకోవటానికి అనేక కష్టాలను పడ్డారు.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications