Aloe vera Farming: మహారాష్ట్రలోని కరువు పీడిత సతారా జిల్లాలోని రైతులు సాగునీటి కోసం ఎక్కువగా వర్షపునీటిపైనే ఆధారపడుతుంటారు. ఈ క్రమంలో పంటలు పూర్తిగా ప్రకృతిపైనే ఆదారపడి ఉన్నాయి. ఒక వ్యాపారవేత్త ఇచ్చిన సలహాతో ఈ గ్రామానికి చెందిన అనేక మంది రైతులు కలబంద సాగుకు శ్రీకారం చుట్టారు.
అలా కలబంద సాగు ప్రారంభించిన యువరైతు హృషీకేష్. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన హృషికేష్‌కు బదలి గ్రామంలో 8 ఎకరాల భూమి ఉంది. అతని కుటుంబం సాంప్రదాయకంగా వరి, మినుము, మొక్కజొన్న, గోధుమ వంటి పంటలను సాగుచేసేది. అయితే పొడి ప్రాంతం కావడంతో ఇక్కడ సాగు చేసే పంటలు వర్షపు నీటిపైనే ఎక్కువగా ఆధారపడి ఉండేది.
అలాగే ఇతర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకునే సౌకర్యం లేదు. దీంతో వారి పంటలు ఎండిపోయేవి. నలుగురితో కూడిన కుటుంబం హృషికేష్ తండ్రి నెలవారీ జీతం రూ.2,000పై పూర్తిగా ఆధారపడి ఉంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో నాసిరకం చపాతీలు, అప్పుడప్పుడు కూరగాయలతో బతుకుసాగిస్తూ వచ్చారు.

హృషీకేశ్ ఎప్పుడూ చెప్పులు కూడా ధరించలేదు. 20 ఏళ్ల వయస్సులో కుటుంబానికి సహాయంగా నిలిచేందుకు, తన ఉన్నత విద్యకు మద్ధతు కోసం ఒక మార్కెటింగ్ కంపెనీలో పనికి చేరాడు. అయితే కంపెనీ సేల్స్ డిపార్ట్‌మెంట్‌లో లక్ష టార్గెట్‌ను చేరుకుంటే నెలకు రూ.3500 అందించేది. ఈ ఉద్యోగంలో ఆదాయం స్థిరంగా లేనప్పటికీ దాదాపు నాలుగు నెలల పాటు అందులో కొనసాగాడు. ఉద్యోగం ఇబ్బందిగా మారటంతో.. స్వగ్రామంలో ఏదైనా వ్యాపారం చేసుకుందామని ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఆ సమయంలోనే మునగ, బొప్పాయి కొనుగోలు, విక్రయానికి నర్సరీని ప్రారంభించాడు. అలా అదే సమయంలో ఎరువుల వ్యాపారాన్ని సైతం క్రమంగా ప్రారంభించాడు.
ఈ క్రమంలోనే హృషీకేశ్ మామిడి, జామకాయ చెట్ల మధ్య 4000 కలబంద మొక్కలను నాటారు. కలబంద మొక్కకు చెదపురుగులను తరిమికొట్టే శక్తి ఉంది. దీంతో తన పొలానికి ఎలాంటి నష్టం వాటిల్లదని భావించి.. మామిడి చెట్లకు రక్షణగా ఉంటుందని ఈ పని చేశాడు. జీవితం ఈ కష్టంతో హార్టికల్చర్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశాడు. సతారాలో ఏర్పాటు చేసిన ఫెయిర్‌లో కలబంద ఉత్పత్తులను విక్రయిస్తున్న పారిశ్రామికవేత్తను చూసి సబ్బులు, షాంపూలు, కలబంద రసం వంటి ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించాడు. ఇది పెద్దగా రాబడిని అందించకపోవటంతో కలబందను ఉపయోగించి మొక్కల పెరుగుదలకు సహజమైన పురుగుమందులు, ఎరువులను తయారు చేశాడు.
సహజంగా అరటి ఆకులకు నీరు రాస్తే అవి ఆకుపై నిలవవు. ఈ విషయం తెలిసి అలోవెరా స్ప్రెడర్‌ని తయారు చేశాడు. దీన్ని పిచికారీ చేయడం వల్ల పురుగులు దూరంగా ఉంటాయి. 2013లో స్నేహితుల సహకారంతో హృషికేష్ తన ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం ప్రారంభించాడు. ప్రస్తుతం అతను ఫామ్ నుండి సగటున 8000 లీటర్ల ఉత్పత్తిని ఉత్పత్తి చేస్తున్నాడు. రెండు ఎకరాల భూమిలో కలబంద సాగుతో ఏడాదికి రూ.3.5 కోట్ల టర్నోవర్ సాధించాడు. ఇందులో దాదాపు 30 శాతం రాబడిగా అందుకున్నాడు. సహజంగా అందరూ కలబంద నుంచి చర్మసౌందర్యానికి వాడే ఉత్పత్తులకు బదులుగా పురుగుల మందలు తయారు చేసి గొప్పవిజయం సాధించాడు. అనేక కష్టాలను ఎదుర్కొన్న ఈ యువరైతు ప్రయాణం అనేక ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ ప్రస్తుతం చాలా మందికి స్పూర్తిదాయకంగా మారింది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications