Success Story: మనసులో ఏదైనా చేయాలనే బలమైన సంకల్పం ఉంటే అది మిమ్మల్ని ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందుకు తీసుకెళుతుంది. హర్యానాలోని చిన్న గ్రామం నుంచి యూఎస్ దిగ్గజ కంపెనీకి సీఈవోగా మారిన విజయగాథ గురించి తెలుసుకుందాం..
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది పునీత్ రెంజెన్ సక్సెస్ స్టోరీ గురించే. జీవితంలో ఒకానొక సమయంలో స్కూల్ ఫీజు చెల్లించేదుకు కూడా డబ్బు లేని స్థాయి నుంచి పునీత్ రెంజెన్ చాలా ఎత్తుకు ఎదిగారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా పునీత్ చదువు మానేయాల్సి వచ్చింది. అయినా నేర్చుకోవాలనే అతనిలోని తపన కారణంగా రోహ్‌తక్‌లోని ఒక కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత ఉద్యోగం కోసం వార్తా పత్రికలోని ప్రకటన చూసి దిల్లీకి చేరుకున్నాడు.

తర్వాతి కాలంలో అతను రోటరీ స్కాలర్‌షిప్ ద్వారా 1984లో అమెరికాలో తనడిగ్రీని కొనసాగించగలిగాడు. అలా 2 జతల జీన్స్, టేప్ రికార్డర్, చేతిలో కొన్ని డాలర్లతో అమెరికాకు చేరుకున్నాడు. అక్కడి యాస కూడా సరిగా రాదు. డెలాయిట్ భాగస్వామి 1989లో స్థానిక మ్యాగజైన్‌లో టాప్-10 మంది విద్యార్థుల్లో అతని పేరును గమనించినప్పుడు జీవితం మలుపు తిరిగింది. ఈ నాటకీయ పరిణామం ఉద్యోగం పొందేందుకు సహాయపడింది. అలా 2015లో సోసియేట్ కన్సల్టెంట్ నుంచి కంపెనీ CEOగా పదోన్నతి పొందారు.
దీంతో బిగ్ ఫోర్ గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్‌లో ఒకదానికి నాయకత్వం వహించిన మొదటి ఆసియా-అమెరికన్‌గా పునీత్ రెంజెన్ చరిత్ర సృష్టించారు. ఐటీ దిగ్గజం డెలాయిట్ ఆదాయ వృద్ధికి అతని నాయకత్వం కీలకంగా నిలిచింది. దీంతో 2019లో మరో నాలుగేళ్ల కాలానికి డెలాయిట్ గ్లోబల్ సీఈవోగా తిరిగి నియమితులయ్యారు. అలా డిసెంబర్ 2022లో పదవి నుంచి వైదొలగారు.
అలాగే కరోనా మహమ్మారి సమయంలో.. పునీత్, డెలాయిట్ హర్యానాలో ఆరోగ్య సంరక్షణ ప్రణాళికను అభివృద్ధి జరిగింది. అప్పట్లో ఇది స్థానికులకు, దూరంగా ఉన్న ప్రాంతాలకు సహాయం చేసింది. AASHA, అంగన్‌వాడీ నిపుణుల సహాయంతో పేదలకు సేవ చేయడంలో తమ నిబద్ధతను ప్రదర్శిస్తూ మూడంచెల వైద్య మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు.


Click it and Unblock the Notifications