Prathap Reddy: చాలా మంది తమ వ్యాపారాలను కొంత వయస్సు వచ్చిన తర్వాత తరువాతి తరానికి అప్పగిస్తుంటారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న వ్యక్తి మాత్రం తన 90వ ఏట కూడా కంపెనీలను దగ్గరుండి నడిపిస్తూ జోష్ కొనసాగిస్తున్నారు.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది ప్రతాప్ రెడ్డి సక్సెస్ స్టోరీ గురించే. అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు అండ్ ఛైర్మన్. 1970లలో అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన రెడ్డి తర్వాత 1983లో కంపెనీని స్థాపించారు. ప్రతాప్ రెడ్డికి చెందిన అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ.86,264 కోట్లుగా ఉంది. ఫోర్బ్స్ రియల్ టైమ్ ప్రకారం ప్రతాప్ రెడ్డి నికర విలువ రూ.24,030 కోట్లుగా ఉంది. దీంతో ఆయన ప్రస్తుతం భారతదేశంలోని అత్యంత సంపద కలిగిన బిలియనీర్ల జాబితాలో ఒకరిగా కొనసాగుతున్నారు.

రెడ్డికి 1991లో పద్మ భూషణ్ అవార్డును అందుకోగా.. 2010లో భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌తో భారత ప్రభుత్వం సత్కరించింది. ఆయనకు నలుగురు కుమార్తెలు. వీరు భారతదేశంలోని అత్యంత విజయవంతమైన ఆసుపత్రులలో ఒకటైన అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌ను నిర్వహించడంలో నిమగ్నమై ఉన్నారు. పెద్దాయన ప్రీతారెడ్డి, మూడో కుమార్తె శోభనా కామినేని కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు. రెండో కూతురు సునీతారెడ్డి మేనేజింగ్ డైరెక్టర్‌గా, చిన్న కూతురు సంగీతారెడ్డి కో-మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు.
92 ఏళ్ల వయసులో కూడా ప్రతాప్ రెడ్డి గ్రూపు ఎదుగుదల కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ఆయన వివిధ ఆరోగ్య సంస్థలను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. 2022లో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ నైరోబీ (కెన్యా)లో పామర్ హెల్త్‌కేర్ భాగస్వామ్యంతో ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. తెలుగు హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా ప్రతాప్ రెడ్డి మనవరాలు అనే విషయం చాలా మందికి తెలియదు. ప్రస్తుతం అపోలో గ్రూప్ దేశంలో దాదాపు 6000 డిస్పెన్సరీలు, 2000 రిటైల్ అవుట్‌లెట్లను విజయవంతంగా నిర్వహిస్తోంది. దీని వెనుక ప్రతాప్ రెడ్డి నిరంతర శ్రమ, కృషి ఉండటం వల్లనే సక్సెస్ అయ్యారు.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications