Success Story: ఫార్మా రంగంలో ముందుగా అడుగుపెట్టిన అనేక మంది మంచి విజయాలను చూశారు. ప్రస్తుతం భారత్ నుంచి ప్రపంచంలోని అనేక దేశాలకు మందులు సరఫరా కావటంతో వారు బిలియనీర్లుగా మారిపోయారు.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది జెనరిక్ మందుల తయారీదారు అగ్రగామిగా కొనసాగుతున్న కంపెనీ స్థాపకుని విజయగాథ గురించే. అవును జెనరిక్స్ తయారీదారు ఇంటాస్ ఫార్మాస్యూటికల్స్ వ్యవస్థాపకుడు హస్ముఖ్ చుడ్గర్ దేశంలో చాలా గుర్తింపు పొందారు. ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో 89 ఏళ్ల బిలియనీర్ పరిచయం అక్కర్లేని వ్యక్తి. ఇంటాస్ కంపెనీని ఆయన 1977లో స్థాపించారు.

ప్రస్తుతం హస్ముఖ్ చుడ్గర్ ఇద్దరు వారసులు నిమిష్, బినిష్‌లు 2.3 బిలియన్ డాలర్ల ఆదాయం ఉన్న కంపెనీని నడుపుతున్నారు. మన కరెన్సీ లెక్కల ప్రకారం కంపెనీ ఆదాయం దాదాపు రూ.19,080 కోట్లని చెప్పుకోవాలి. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఫార్మా రంగంలో సైరస్ పూనావల్లా, దిలీప్ షాంఘ్వీ తర్వాత చుడ్గర్ మూడవ అత్యంత సంపన్న బిలియనీర్‌గా కొనసాగుతున్నారు. ఆగస్టు 13, 2023 నాటికి రియల్ టైమ్ నికర విలువ రూ.63,040 కోట్లుగా ఉంది. దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో హస్ముఖ్ 290వ స్థానంలో ఉన్నారు.
అహ్మదాబాద్ ప్రధాన కార్యాలయంగా ఉన్న ఇంటాస్ కంపెనీలో చుడ్గర్ కుటుంబానికి 83.85% వాటాను ఉంది. 10.13% వాటా టెమాసెక్ హోల్డింగ్స్, 6.02% క్రిస్ క్యాపిటల్ వాటా కలిగి ఉంది. హస్ముఖ్ గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి ఫార్మసీలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఇంటాస్‌కి సింగపూర్‌కు చెందిన టెమాసెక్ మద్దతును కలిగి ఉంది. ఇది భారతదేశంలో 10, మిగిలిన యూరప్, మెక్సికోలతో సహా 15 ఫ్యాక్టరీలను నిర్వహిస్తోంది.
బ్రెడ్స్ క్యాన్సర్ చికిత్స కోసం ఉపయోగించే ఎలిఫ్తా అనే సరసమైన మందును కంపెనీ 2019లో ప్రారంభించింది. చుడ్గర్ మూడవ కుమారుడు ఉర్మిష్ కంపెనీ బయోఫార్మా వ్యాపారానికి నాయకత్వం వహిస్తున్నాడు. ఉర్మిష్ ఒక హెమటాలజిస్ట్-ఆంకాలజిస్ట్. 2006లో ఇంటాస్ ఫార్మాస్యూటికల్స్ స్వతంత్ర బయోటెక్నాలజీ విభాగం ఉర్మిష్ చుడ్గర్ చేత ఇంటాస్ బయోఫార్మాస్యూటికల్స్‌గా చేర్చబడింది. కానీ తరువాత 2012-13లో అనుబంధ సంస్థ మాతృ సంస్థ ఇంటాస్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌లో విలీనం చేయబడింది.


Click it and Unblock the Notifications