Success Story: రోజుకు 50 పైసల కోసం కష్టపడింది.. నేడు రూ.100 కోట్ల కంపెనీకి యజమాని..

Patricia Narayan Success: దేశంలో ప్రజలు ప్రస్తుతం సొంతంగా తమకాళ్లపై తాము ఏదైనా చేసి నిలబడాలని భావిస్తున్నారు. లక్షల్లో వేతనాలు అందుకున్నా సొంతంగా చేసే పనిలోనే ఎక్కువ సంతృప్తి చెందుతున్నారు. అలా విజయం సాధించిన చాలా మంది సక్సెస్ స్టోరీలు అనేక మంది యువతకు మార్గనిర్థేశకంగా నిలుస్తున్నాయి.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది పెట్రిసియా నారాయణ్ అనే మహిళ సక్సెస్ స్టోరీ గురించే. ఆమె తమిళనాడులోని నాగర్‍కోయిల్ ప్రాంతంలో జన్మించారు. క్రిష్టియన్ అయిన ఆమె ఒక బ్రాహ్మిణ్‍ని 17 ఏళ్ల వయస్సులోనే పెళ్లి చేసుకుంది. అయితే ఆమె భర్త మాదకద్రవ్యాలు, డ్రగ్స్ కి భావిసగా మారినట్లు పెళ్లైన కొన్నాళ్లకు తెలుసుకుంది. పిల్లలకు, తనకు సమయం కేటాయించకపోవటంతో అతడు ఎట్టిపరిస్థితుల్లోనూ మారే పరిస్థితులు లేకపోవటంతో ఏడాది తర్వాత విడాకులు తీసుకోవాలని నిర్ణయించింది. అయితే ఇద్దరు పిల్లలతో ఎటుపోవాలా అని దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెను తిరిగి ఆమె తండ్రి క్షమించి అంగీకరించారు.

Know success story of Patricia Narayan who struggled to earn 50 paise netwoth was 100 crores

అయితే ఆమె తన సొంత కాళ్లపై నిలబడాలని నిర్ణయించుకుంది. దృఢ సంకల్పంతో వంటపై ఉన్న ఆసక్తితో తల్లి నుంచి కొంత డబ్బు తీసుకుని పచ్చళ్లు, జామ్ లు వంటివి సిద్ధం చేసి విక్రయించటం ప్రారంభించింది. వేగంగా విక్రయించేయటంతో నమ్మకం పెరిగింది. అలా వ్యాపారం నుంచి సంపాదించిన మెుత్తాన్ని దాచుకోవటం ప్రారంభించింది. దీని తర్వాత ఆమె చెన్నై మెరీనా బీచ్ లో టీ, కాఫీ, జ్యూస్, స్నాక్స్ అమ్మే షాపు పెట్టగా మెుదటి రోజు కేవలం ఒక్క కాఫీ మాత్రమే అమ్మగలిగింది. అయితే నమ్మకం కోల్పోకుండా ముందుకు సాగటంతో తర్వాతి రోజు రూ.700 వ్యాపారం జరిగింది. దీంతో ఆమె తన మెనూలో శాండ్‌విచ్‌లు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఐస్‌క్రీమ్‌లను కూడా చేర్చింది. అలా 1982 నుంచి 2003 వరకు తన సొంత వ్యాపారంతో కుటుంబాన్ని పోషించింది. ఈ క్రమంలో స్లమ్ క్లియరెన్స్ బోర్డ్ చైర్మన్ ఆమె ఆహారాన్ని రుచిచూసి కార్యాలయంలో క్యాంటీన్‌ను పర్యవేక్షించే అవకాశాన్ని పొందటంతో జీవితం మలుపు తిరిగింది.

అలా ఆమె తన వ్యాపారాన్ని చెన్నైలో కొత్త బ్రాంచీలతో విస్తరించారు. 1998లో సంగీత రెస్టారెంట్ గ్రూప్‌లో భాగస్వామిగా చేరింది. ప్రస్తుతం ఆమె సందీప్ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ 14 వివిధ ప్రాంతాల్లో 200 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఆమె చనిపోయిన కుమార్తె పేరుపై ప్రస్తుతం ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పెట్రిసియా నారాయణ్ నికర విలువ దాదాపు రూ.100 కోట్లుగా లెక్కించబడింది. అయితే తొలినాళ్లలో చాలా తక్కువ రేటుకే బీచ్ వద్ద కాఫీ విక్రయించటం నుంచి ప్రారంభమైన ప్రయాణం చాలా మందికి స్పూర్తిదాయకంగా నిలుస్తోంది.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+