KK Jhunjhunwala Success: ప్రస్తుత కాలంలో సక్సెస్ కోసం వెంపర్లాడుతున్న యువత ఐడియా ఉంటే చాలు పెట్టుబడులు ఆటోమెటిక్ గా వస్తున్నాయి. ఇండియాలో స్టార్టప్ ఎకోసిస్టమ్ ప్రస్తుతం ఉన్నందున చాలా మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బు సమకూరుతోంది. కానీ ఇవేమీ లేని రోజున వ్యాపార సంస్థలను నెలకొల్పి వాటిని ముందుకు నడిపిన వ్యక్తులను మనం ఆదర్శంగా తీసుకోవటం చాలా ముఖ్యం. వాళ్లు నడిచిన బాటలో ఎదురైన అనేక సవాళ్లు వాటి పరిష్కారాలు మనకు ప్రయాణాన్ని సాఫీగా కొనసాగించటానికి దోహదపడతాయి.
ఇప్పుడు మనం మాట్లాడబోతున్నది కెకె జున్‌జున్‌వాలా స్థాపించిన యెష్ పేపర్స్ కంపెనీ సక్సెస్ స్టోరీ గురించే. వాస్తవానికి ఆయన చెరకు పిప్పి వ్యర్థాల నుంచి ఉత్పత్తులను తయారు చేసేందుకు ఒక పేపర్ మిల్ పెట్టాలని 1981లో భావించారు. తండ్రికి ఉన్న చెరకు ప్రాసెసింగ్ మిల్లులో వ్యర్థాలను పేపర్ ప్రత్యామ్నాయ ఉత్పత్తులను సిద్ధం చేసేందుకు ఉపయోగించాలనుకున్నాడు. ఆలోచన బాగానే ఉన్నప్పటికీ దానికి అవసరమైన యంత్రాలను కొనుగోలు చేయటానికి కావాల్సిన నిధులు లేమితో ఇబ్బంది పడ్డాడు. అయితే ఈ క్రమంలో జున్‌జున్‌వాలా భార్య తన బంగారాన్ని అమ్మి భర్త వ్యాపారానికి పెట్టుబడిగా అందించారు. అది ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.

ఈ ప్రయాణంలో అనారోగ్యం 90ల చివరి కాలంలో కంపెనీని విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. కుమారుడు వేద్‌కృష్ణ వ్యాపారాన్ని ముందుకు నడిపించే బాధ్యతలు తీసుకోవటానికి ముందుకు రావటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో వ్యాపారాన్ని కొనసాగించారు. అయితే ఉన్నత చదువుల తర్వాత విదేశాల నుంచి తిరిగి వచ్చిన వేద్ వ్యాపార బాధ్యతలు చేపట్టాడు. ఈయన రాకతో కంపెనీ మెల్లగా పుంజుకోవటం ప్రారంభించింది. అలా 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.414 కోట్ల వ్యాపారాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో కంపెనీ 2019లో రీబ్రాండింగ్ చేసుకుని పక్కా లిమిటెడ్ పేరుతో అందరికీ సుపరితంగా మారింది.
ప్రస్తుతం కంపెనీకి 50,000 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉండగా దీనిని 80,000 టన్నులకు పెంచాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. కంపెనీ పర్యావరణ హితమైన బయోడీగ్రేడబుల్ ఉత్పత్తులను బగాసే నుంచి ఉత్పత్తి చేయటంతో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి అంగీకారాన్ని పొందింది. ఒకప్పుడు కేవలం చెత్తగా భావించిన దాని నుంచి వందల కోట్ల వ్యాపారాన్ని సృష్టించటంతో ఈ సక్సెస్ స్టోరీ అందరికీ మార్గదర్శకంగా మారింది. అయితే తండ్రి నుంచి వ్యాపార బాధ్యతలు చేపట్టినప్పుడు.. వ్యాపారంలో వృద్ధి కనిపించకపోవటం, ఆదాయాలు పెరగకపోవటం, ఉద్యోగులు సైతం సంతోషంగా లేకపోవటంతో నిరంతరం వ్యాపారం ఎప్పుడు దివాలా తీస్తుందో అనే భయంతో ఉండేవాడినని వేద్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అయితే తండ్రి కలను ముందుకు తీసుకెళ్లాలనే ఒకే ఒక్క పట్టుదలతో ముందుకు సాగానని తెలిపారు. ఈ క్రమంలో అనేక ప్రముఖ బ్రాండ్లతో జతకట్టడం కంపెనీని వృద్ధి బాటలోకి తీసుకురావటంలో దోహదపడిందని తెలిపారు.
పెద్ద ప్రాజెక్ట్‌ను దక్కించుకున్నట్లే వేద్ తన తండ్రిని కోల్పోయాడు. 2010లో దాదాపుగా కంపెనీ మూసివేతకు దారితీసిందని వేద్ పేర్కొన్నారు. తన తండ్రికి ఉన్న సద్భావన కారణంగానే తాము ఈ కాలాన్ని కొనసాగించగలిగామని వేద్ ప్రతిబింబించారు. దశాబ్ధాలుగా నిర్మించబడిన కంపెనీలు సరఫరాదారులు, కొనుగోలుదారులు వారికి మద్దతునిస్తూనే ఉన్నారని వేద్ పేర్కొన్నాడు. వారు ప్యాకేజింగ్ వ్యాపారంలో ఉన్నప్పుడు వ్రాపింగ్, బ్యాగ్ కాగితాన్ని సరఫరా చేయడం ప్రభావం సృష్టించడం లేదు. ఈ క్రమంలోనే భవిష్యత్తు కోసం క్లీనర్ ప్లానెట్ కోసం వేద్ కంపోస్టబుల్ ప్యాకేజింగ్ సొల్యూషన్స్‌పై పని చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం కంపెనీ వరి పొట్టు వాడటం ద్వారా 95 శాతం రసాయనాలను ప్యాకేజింగ్ నుంచి తొలగించింది.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications