Nisha Madhulika Success: నచ్చిన పనిచేస్తూ విజయం సాధించటానికి వయస్సుతో అస్సలు పనిలేదని మరోసారి రుజువైంది. ఈరోజుల్లో చాలా మంది తమ చుట్టూ అనేక అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని అందిపుచ్చుకోవటంలో ఏదో కొరవడిందని వాటిని అడ్డంకులుగా భావిస్తుంటారు. అయితే పని చేసుకుంటూ ముందుకు సాగే వ్యక్తులు మాత్రం ఏదోవిధంగా వాటిని అధిగమిస్తూనే ఉంటారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది యూట్యూబ్‌లో వంట వీడియోలు పెట్టి రూ.43 కోట్లు సంపాదిస్తున్న మహిళ గురించే. నిషా మధులిక ప్రస్తుతం తన 65 ఏళ్ల వయస్సులో తనకు నచ్చిన పనిచేస్తూ కోటీశ్వర్రాలుగా మారారు. వృత్తిరీత్యా ఆమె టీచర్. కానీ ప్రస్తుతం ఆమె ఫుల్ టైమ్ యూట్యూబర్‌గా మారారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పుడు చాలా మందికి ఆదాయ వనరులుగా మారటాన్ని ఆమె కూడా వినియోగించుకుంటున్నారు.

65 ఏళ్ల వయస్సులో ఆమె తన ప్రతిభను ప్రదర్శిస్తూ మంచి కంటెంట్ క్రియేటర్‌గా మారారు. లక్షల సంఖ్యలో ఫాలోయర్లను భారతీయ వంటకాల కోసం వెతుకుతున్న చాలా మంది తప్పనిసరిగా నిషా పేజీని చూసే ఉంటారు. నిషా మధులిక అత్యంత ప్రజాదరణ పొందిన ఫుడ్ ప్రిపరేషన్ వీడియోల్లో ఒకటి. యూట్యూబ్‌లో అతనికి 14.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. నిషా మధులిక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి వంటలంటే ఆసక్తి, కొత్తరకాల వంటకాలు ప్రయత్నించేవారు.
వాస్తవానికి టీచర్ జాబ్ చేస్తున్న ఆమె 2011లో యూట్యూబ్‌లోకి అడుగుపెట్టారు. అలా మెుదలైన నిషా ప్రయాణం నిరంతరాయంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 65 ఏళ్ల నిషా మధులిక యూట్యూబ్ ఛానెల్ ఆమెకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. సులువుగా అందరికీ అర్థమయ్యేలా వంట తయారీ వీడియోలను చేయటంతో నిషా దిశ మారిపోయింది. దీంతో ఆమె యూట్యూబ్ ఆదాయం భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం నోయిడాలో నివసిస్తున్న ఆమె భర్తకు తన ఆదాయంతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడంలో సహాయం చేస్తోంది. 2017లో జరిగిన సోషల్ మీడియా సమ్మిట్ & అవార్డ్స్‌లో టాప్ యూట్యూబ్ వంట కంటెంట్ క్రియేటర్ అవార్డును గెలుచుకున్నాడు.
More From GoodReturns

Success story: రూ. 600 కోట్ల సామ్రాజ్యాన్ని వదిలి మళ్ళీ సున్నా నుండి మొదలుపెట్టాడు!

Trending: యూపీలో వింత ఘటన.. సామాన్యురాలి ఖాతాలోకి రూ. 10 కోట్లు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications