Neha Narkhede Success: జీతం లక్షల్లో వచ్చినా లేక కోట్లలో ఉన్నా సొంత వ్యాపారంలో వచ్చే కిక్కే వేరప్పా. ఇది నేటి తరం యువత ఫాలో అవుతున్న ఫార్ములా. ప్రధానంగా కొందరు సొంత డబ్బుతో సంస్థలను నిర్మిస్తుండగా, మరికొందరు మాత్రం స్టార్టప్ కల్చర్ వల్ల ఫండింగ్ సదుపాయాలను వినియోగించుకుంటూ తమ కంపెనీలను ఫ్లోట్ చేస్తున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నేహా నార్ఖేడే సక్సెస్ స్టోరీ గురించే. ఇది ప్రస్తుతం చాలా మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్పూర్తిగా నిలుస్తోంది. ఆమె పుట్టింది ఇండియాలోనే అయినప్పటికీ పెరిగింది, చదువుకుంది మాత్రం యునైటెడ్ స్టేట్స్‌లోని జార్జియా టెక్ నుండి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆమె ఈ క్రమంలో ఒరాకిల్, లింక్డ్ఇన్ వంటి ప్రముఖ టెక్నాలజీ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన అనుభవం కలిగి ఉన్నారు. ఈ క్రమంలోనే సొంతంగా ఏదైనా ప్రారంభించాలనే ఆలోచనతో 2014లో సొంత వెంచర్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో డేటా స్ట్రీమింగ్ కోసం ప్లాట్‌ఫారమ్‌ను అందించే కాన్‌ఫ్లూయెంట్ అనే వ్యాపారాన్ని ప్రారంభించారు.

ప్రస్తుతం నేహాకు కన్‌ఫ్లూయెంట్‌లో 6% కంటే ఎక్కువ వాటా ఉంది. అలాగే కంపెనీ మార్కెట్ క్యాప్ 9.4 బిలియన్ డాలర్లుగా ఉందని తెలుస్తోంది. భారతీయ కరెన్సీ లెక్కల ప్రకారం కంపెనీ విలువ ఏకంగా రూ.78,000 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో నేహా నికర విలువ 520 మిలియన్ డాలర్లుగా ఉంది. అయితే ఈ విజయంతో ఆమె ఆగిపోలేదు. 2021లో ఫ్రాడ్ డిటెక్షన్ కంపెనీ ఓస్కిలార్‌ను ఆమె ప్రారంభించారు. ప్రస్తుతం ఆమె కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె కంపెనీలో దాదాపు రూ.160 కోట్లను పెట్టుబడిగా పెట్టారు. పట్టుదల, కృషితో పనిచేస్తే ఎవరైనా తమ లక్ష్యాలను సాధించగలరని నేహా సక్సెస్ సాక్ష్యంగా నిలుస్తోంది.
తాను ఇంతటి విజయం సాధించటానికి తండ్రి సహకారం ఉందని, తనకు వెన్నుదన్నుగా ధైర్యాన్ని కల్పించింది ఆయనేనని సీఎన్బీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు. మహిళలు తాము అనుకున్నది ఏదైనా సాధించగలరన్న నేహా నమ్మకం చిన్నతనంలో కిరణ్ బేడీ, ఇంద్రా నూయి, ఇందిరా గాంధీ గురించిన పుస్తకాలను చదివినప్పుడు మరింత బలపడిందని నేహా వెల్లడించారు.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications