Success Stoy: చిన్న ప్రారంభం నుంచి రూ.20,000 కోట్ల టర్నోవర్.. రియల్ సక్సెస్ స్టోరీ
Nandini Ghee: తిరుమల వెంకటేశ్వరుని సేవలో తరించటం అంత సులువైన విషయం కాదు. అయితే ఆ భాగ్యం ఎంతో అదృష్టం ఉన్న సంస్థలకు, వ్యక్తులకు మాత్రమే లభిస్తుందని ప్రగాఢ నమ్మకం. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న కంపెనీ అనేక దేవాలయాలకు ప్రసాదం తయారీలో కీలకమైన నెయ్యిని అందించే సంస్థగా ప్రస్తుతం దేశంలో గుర్తింపును అందుకుంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది తిరుమల వెంకటేశ్వరస్వామి వారికి లడ్డు తయారీలో నెయ్యిని సరఫరా చేస్తున్న నందిని కంపెనీ సక్సెస్ స్టోరీ గురించే. తిరుపతి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత.. ఏపీ ప్రభుత్వం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అయిన నందిని నుంచి నెయ్యి కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అమూల్ మిల్క్ కంపెనీ నార్త్ ఇండియాలో అందరికీ తెలిసినట్లే, నందిని మిల్క్ కంపెనీ సౌత్ ఇండియాలో అందరికీ సుపరిచితమైన సంస్థ. కంపెనీ వ్యాపారం ప్రస్తుతం ఏపీ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గోవాలో కూడా తన పాల ఉత్పత్తులను విక్రయిస్తోంది.

నందిని బ్రాండ్ కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్స్ కో-ఆపరేటివ్ సొసైటీకి చెందిన బ్రాండ్. నందిని దేశంలో రెండవ అతిపెద్ద పాల సహకార సంస్థగా గుర్తింపును కొనసాగిస్తోంది. ఈ సంస్థ ప్రస్థానం 1995లో కర్ణాటకలోని కొడగు జిల్లాలో మొట్టమొదటి పాల సహకార సంఘం స్థాపించబడింది. అప్పట్లో పాలను ప్యాకెట్లలో పెట్టి విక్రయించే విధానం ఆచరణలో లేదు. తర్వాత 1970లలో పాల ఉత్పత్తిని పెంచాలని సహకార సంఘం నిర్ణయించింది. ఆ సమయంలోనే దేశంలో శ్వేత విప్లవం వచ్చింది. అప్పట్లో ఇండియాలో పాల ఉత్పత్తిని మెరుగుపరచటానికి ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయాన్ని కూడా అందించింది. దీని ఆధారంగానే 1974లో కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక మిల్క్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. కానీ పదేళ్ల తర్వాత.. 1984లో కర్ణాటక మిల్క్ కో-ఆపరేటివ్ సొసైటీగా పేరు మార్చారు. అప్పుడే సహకార సంస్థ నందిని బ్రాండ్ పేరుతో ప్యాకెట్లలో పాలను విక్రయించడం మెుదలుపెట్టింది.
అలా కర్ణాటక వ్యాప్తంగా పాల ఉత్పత్తుల విక్రయంలో కంపెనీ పేరుగాంచింది. కర్ణాటక మిల్క్ కో-ఆపరేటివ్ సొసైటీ కింద మొత్తం 15 పాల ఉత్పత్తి సంఘాలు నందిని బ్రాండ్‌ను కలిగి ఉన్నాయి. ఇవి రైతుల నుంచి పాలను సేకరించి నందినికి పంపుతాయి. కంపెనీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24,000 గ్రామాల్లోని 26 లక్షల మంది రైతుల నుంచి ప్రతిరోజు 86 లక్షల లీటర్ల పాలను సేకరిస్తోంది. పాల సేకరణ రుసుముగా కంపెనీ రైతులకు రోజుకు రూ.28 కోట్లు చెల్లిస్తుంది. కంపెనీ నందిని బ్రాండ్ కింద పాలు, పెరుగు, వెన్న, పన్నీర్, చీజ్, నెయ్యి, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ సహా అనేక ఇతర ఉత్పత్తులను విక్రయిస్తోంది. FY 2022-23లో నందిని మిల్క్ కంపెనీ రూ.19,784 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. తక్కువ ధరకు తిరుమల లడ్డు తయారీకి నెయ్యి సరఫరా చేయలేమని గతంలో టెండర్ల నుంచి తప్పుకున్న నందిన తాజాగా ఏపీ ప్రభుత్వ చొరవతో తిరిగి సరఫరాను పునరుద్ధరించింది.


Click it and Unblock the Notifications