Mukesh Bansal: దేశీయంగా గత దశాబ్ధకాలంగా స్టార్టప్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో అనేక మంది ఐఐటీ, ఐఐఎమ్ యువత నవతరం కంపెనీలను స్థాపించి మిలియనీర్లుగా మారిపోయారు.
ఈ క్రమంలోనే ఐఐటీ కాన్పూర్ గ్రాడ్యుయేట్ ముఖేష్ బన్సాల్ సైతం అతిపెద్ద సోషల్ మీడియా ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు గాంచారు. అతను మొదట అమెరికాలోని చికాగో డెలాయిట్‌లో చాలా సంవత్సరాలు పనిచేశారు. పరిశ్రమ అనుభవాన్ని పొందడానికి బన్సాల్ కొన్ని సిలికాన్ వ్యాలీ కంపెనీల్లో కూడా పనిచేశాడు. అప్పుడే సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకుని.. ఇండియాకు తిరిగి వచ్చాడు. అలా 2007లో ఫ్యాషన్ ఈ-కామర్స్ కంపెనీ మింత్రాను తన స్నేహితులైన అశుతోష్ లావానియా, వినీత్ సక్సేనాతో కలిసి ప్రారంభించాడు.

మెుదట్లో ఒక బహుమతి వేదికగా ఉన్న మింత్రా తర్వాతి కాలంలో భారతదేశపు ప్రజల ఫ్యాషన్ అవసరాలను తీర్చే కంపెనీగా ఎదిగింది. వ్యాపారంలో మింత్రా వృద్ధి ఇతర ప్రధాన కంపెనీల దృష్టిని ఆకర్షించింది. అలా దీనిని చివరికి మరో దిగ్గజమైన ఫ్లిప్‌కార్ట్ రూ.2,730 కోట్లకు కొనుగోలు చేసింది. కంపెనీ అమ్మేసిన తర్వాత అడ్వర్టైజింగ్ బిజినెస్ హెడ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ రూ.41,354 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. Myntra వ్యవస్థాపకుడు ముఖేష్ బన్సాల్ ఇప్పుడు క్యూర్ ఫిట్ అనే హెల్త్ అండ్ ఫిట్‌నెస్ కంపెనీకి సీఈవోగా ఉన్నారు.
క్యూర్ ఫిట్ త్వరగా అభివృద్ధి చెంది దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన జిమ్ చైన్ కల్ట్ డాట్ ఫిట్‌తో సహా ఇతర కంపెనీలను కొనుగోలు చేయడం ప్రారంభించింది. కల్ట్ డాట్ ఫిట్ భారతదేశంలో వందలాది శాఖలను కలిగి ఉంది. క్యూర్ ఫిట్ తర్వాతి కాలంలో ఈట్ ఫిట్‌ని కొనుగోలు చేసింది. ఈ విజయం తర్వాతి కాలంలో టాటాలను ఆకట్టుకుంది. అలా తర్వాత కాలంలో క్యూర్ ఫిట్, కల్ట్ ఫిట్‌లకు టాటా డిజిటల్ నుండి గణనీయమైన నిధులు వచ్చాయి. దీంతో బన్సాల్ వ్యాపారం కొత్త పుంతలు తొక్కింది. టాటాలు ఇందులో రూ.620 కోట్లు వెచ్చించారు.

ప్రస్తుతం బన్సల్ కంపెనీల విలువ దాదాపు రూ.12,411 కోట్లుగా ఉండగా.. ఆయన నికర విలువ రూ.4200 కోట్లకు చేరుకుంది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు చెందిన ముఖేష్ బన్సాల్.. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు. ఐఐటీలో బీటెక్ చేసిన తర్వాత డెలాయిట్‌లో సిస్టమ్స్ అనలిస్ట్‌గా రెండు సంవత్సరాలు పనిచేశాడు. తర్వాత నెక్స్ ట్యాగ్, ఈవాంటెడ్, సెంట్రాటా, న్యూస్కేల్ వంటి కంపెనీల్లో కొన్నాళ్లు పనిచేశారు. ఈ కంపెనీలన్నీ సిలికాన్ వ్యాలీలో ప్రారంభమైన ప్రారంభ దశ స్టార్టప్ కంపెనీలు. ఈ స్టార్టప్‌లలో అతను చేసిన కృషి వల్లే ముఖేష్ బన్సాల్‌కు తన స్వంత వ్యాపారాన్ని ప్రారంభించే విశ్వాసం, అనుభవాన్ని పొందాడు.


Click it and Unblock the Notifications