Milky Mist: తండ్రి చేసిన చిన్న వ్యాపారాన్ని వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా అభివృద్ధి చేయటం అంత సులువేమీ కాదు. అయితే నిండా 18 ఏళ్లు కూడా నిండకుండానే తండ్రి వ్యాపారంలోకి వెళ్లి దేశంలో విజయవంతమైన వ్యాపారవేత్తగా మారిన వ్యక్తి విజయగాథను ప్రస్తుతం మనందరం తప్పక తెలుసుకోవాల్సిందే.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది భారతదేశపు అగ్రగామి డెయిరీ కంపెనీగా అవతరించిన మిల్కీ మిస్ట్ సక్సెస్ స్టోరీ గురించే. కంపెనీని సవాళ్లను అధిగమించి ఈ స్థాయికి తీసుకురావటానికి వెనుక సతీష్ కుమార్ కృషి ఎంతగానో ఉంది. తమిళనాడు ఈరోడ్ జిల్లాకు చెందిన సతీష్ తండ్రి ఒక సాధారణ రైతు. ఆయన పాలు విక్రయ వ్యాపారంలో ఉండేవాడు. అయితే 17 ఏళ్లకే చదువు మానేసిన సతీష్ కుమార్ తండ్రి వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. పాలు అమ్మటం చాలా సవాలుగా ఉన్న ఆ రోజుల్లో తన వ్యాపార ప్రయాణాన్ని మెుదలుపెట్టాడు.

కేవలం రెండు రోజుల్లో పాలు చెడిపోయేవి. కస్టపడి వినియోగదారులను సంపాదించినప్పటికీ లాభం మాత్రం కేవలం 3 శాతమే ఉండేది. దీనికి తోడు వివిధ కంపెనీలతో పోటీ పెద్ద సవాలుగా మారింది. దీంతో పాల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారుచేసి మార్కెట్లో విక్రయించాలని సతీష్ మదిలో తోచింది. దీంతో నెయ్యి, పనీర్ వంటి పాల ఉత్పత్తుల తయారీలోకి అడుగుపెట్టాడు. అలా పుట్టిందే మిల్కీ మిస్ట్ కంపెనీ. పైగా ఈ ఉత్పత్తులకు జీవితకాలం ఎక్కువ. దీంతో అతని ఆదాయం 35 శాతానికి పెరిగింది.
1992లో సతీష్ కుమార్ మిల్కీ మిస్ట్ డెయిరీని విజయవంతంగా ప్రారంభించారు. కంపెనీనికి ముందుకు నడిపే క్రమంలో అనేక సవాళ్లను సతీష్ ఎదుర్కొన్నారు. పాల సేకరణ కోసం ప్రత్యేకంగా లాయల్టీ పార్టనర్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమాన్ని రూపొందించారు. దీని ద్వారా రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు పొందడం, గోవుల సంరక్షణలో సహాయం, 24 గంటల అత్యవసర సహాయ కేంద్రం వంటి అనేక సౌకర్యాలు కల్పించారు. ఇలాంటి చర్యలతో కంపెనీ క్రమంగా పురోగమిస్తూ 2008లో రూ.13 కోట్ల వార్షిక టర్నోవర్ అందుకుంది. చీథోడ్‌లో రెండెకరాల స్థలంలో ప్లాంట్‌ను ఏర్పాటు చేసి రోజుకు ఒక మెట్రిక్ టన్ను పన్నీర్‌ను ఉత్పత్తి చేశాడు.

పాల ఉత్పత్తులు చెడిపోకుండా చూసేందుకు జీపీఎస్‌తో కూడిన ట్రక్కులను కొనుగోలు చేసి శీతలీకరణను ఏర్పాటు చేశాడు సతీష్. 2012లో ఆధునిక సౌకర్యాలతో ఎదిగిన మిల్కీ మిస్ట్ డెయిరీ 408 కోట్ల విలువైన కంపెనీగా ఎదిగింది. పనీర్ ఉత్పత్తి కూడా రోజుకు మూడు మెట్రిక్ టన్నులకు పెరిగింది. దీని తర్వాత కంపెనీ పెరుగు, జున్ను వంటి ఉత్పత్తులను లాంచ్ చేసింది. అలా 2014లో కంపెనీ రూ.121 కోట్ల విలువైన కంపెనీగా మారింది. విక్రయాలు పెరగటంతో 2017లో విస్తరించిన ప్లాంట్ రోజుకు 1.5 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో విలువ ఆధారిత పాల ప్రాసెసింగ్ ప్లాంట్‌గా మారింది.
ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగిన కంపెనీ విలువ 2020లో రూ.750 కోట్లకు, 2022లో రూ.1,000 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం కంపెనీ ఆదాయం ఏడాదికి రూ.2,000 కోట్ల టర్నోవర్ మార్కును అందుకుంది. దీనికి తోడు మారిన ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ రెడీమేడ్ చపాతీ, పరాఠా వంటి ఉత్పత్తులను సైతం లాంచ్ చేసింది. ఇదే క్రమంలో కంపెనీ ఐస్‌క్రీం, చాక్లెట్‌తో సహా 20 రకాల ఉత్పత్తులను విక్రయిస్తోంది. ప్రస్తుతం కంపెనీ దేశవ్యాప్తంగా 65 వేల మంది రైతులతో కలిసి పనిచేస్తోంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications