BIBA Success: మహిళలు వ్యాపారవేత్తలుగా విజయవంతంగా ముందుకు సాగటం చాలా కష్టతరం. అందులోనూ ఫ్యాషన్ రంగంలో అగ్రగామిగా ఎదగటం.. వందల కోట్ల వ్యాపారాన్ని స్థాపించటం ఎంత కష్టమో తెలిసిందే. వీటిని అధిగమించిన సూపర్ ఉమెన్ సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రాండెడ్ రెడీమేడ్ దుస్తుల బిబా బ్రాండ్ చాలా మంది మహిళలు ఇష్టపడే సంస్థగా ఎదిగింది. చాలా మంది భారతీయ మహిళలు ఇష్టపడే బ్రాండ్‌గా మారడం అంత సులువుగా జరగలేదు. దిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మీనా బింద్రాకు 20 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు వివాహం చేశారు. అయి ఫ్యాషన్ డిజైన్ పై ఉన్న ఆసక్తితో 40 ఏళ్ల వయస్సులో రెడీ టు వేర్ కంపెనీని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇంటి వద్ద ప్రారంభంలో భర్త బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.8,000 రుణంతో ప్రారంభమైన కంపెనీ ప్రస్తుతం దేశంలో పెద్ద సామ్రాజ్యంగా ఎదిగింది.

కంపెనీని మీనా బింద్రా 1988లో ప్రారంభించారు. అయితే తొలుత ఇంటి వద్దే విక్రయించినప్పటికీ 2004లో ముంబై మాల్‌లో బిబా మెుదటి స్టోర్ లాంచ్ చేశారు. ఆధునిక యువతను ఆకట్టుకునేలా నాణ్యమైన బట్టలు మహిళలను, యువతను ఎక్కువగా ఆకట్టుకున్నాయి. దీంతో బిబా బ్రాండ్ అద్భుతమైన వృద్ధిని సాధించింది.
అలా కంపెనీ వార్షిక టర్నోవర్ 2012 నాటికి ఏకంగా రూ.300 కోట్లకు చేరుకుంది. ఈ క్రమంలో బిబీ షోరూమ్స్ దేశవ్యాప్తంగా అనేక నగరాలకు విస్తరించాయి. అలాగే కంపెనీ తన ఫ్యాషన్ ఉత్పత్తులను ఆన్‌లైన్ ద్వారా విక్రయించటం ప్రారంభించింది. దీంతో 2020 నాటికి టర్నోవర్ రూ.700 కోట్లకు చేరుకుంది.
ప్రస్తుతం కంపెనీ భారతదేశంలోని 76 నగరాల్లో 180 స్టోర్లను కలిగి ఉంది. దాదాపు 275 దుకాణాలు బిబా బ్రాండ్ దుస్తులను విక్రయిస్తున్నాయి. ఇక్కడితో ఆగిపోని కంపెనీ హిందీ చిత్ర పరిశ్రమలో పలు చిత్రాలకు కాస్ట్యూమ్స్ కూడా అందించింది. అమితాబ్ బచ్చన్‌తో సహా బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ బ్రాండ్ ఉత్పత్తులను ధరిస్తారు. ప్రస్తుతం భారత బిలియనీర్ మహిళల జాబితాలో ఉన్న మీనా బింద్రా 70 ఏళ్ల వయసులోనూ అదే జోరుతో తన కార్పొరేట్ కార్యక్రమాలను కొనసాగిస్తూ చాలా మంది మహిళలకు రోల్ మోడల్‌గా నిలిచారు.


Click it and Unblock the Notifications