Beyond Snacks Success: మనలో చాలా మందికి ఉద్యోగం మానేయాలి ఎంత కష్టమైన వ్యాపారం చేసి సక్సెస్ రుచిచూడాలి అనే కోరిక నిరంతరం పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో చాలా మంది రిస్కును రస్క్ లాగా తీసుకుంటూ కలల ప్రపంచంలో విజయ కోటలను నిర్మించుకుంటున్నారు. ఇది దేశంలోని అన్ని రాష్ట్రాలు, అన్ని భాషల ప్రజల్లోనూ ప్రస్తుత తరంలో కనిపిస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది మానస్ మధు సక్సెస్ స్టోరీ గురించే. అతను తన ఉద్యోగాన్ని మానేసి భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు. బియాండ్ స్నాక్స్ పేరుతో నిర్మించిన బ్రాండ్ కింద అరటికాయ టిప్స్ విక్రయిస్తూ ఊహించని విజయాన్ని రుచిచూశాడు. తాను చదువుకునే రోజుల్లో వివిధ ప్రాంతాలకు ప్రయాణించినప్పుడు తాము ఎంతగానో ఇష్టపడే బనానా చిప్స్ తప్పకుండా లగేజీలో వెంట తీసుకెళ్లేవాడు. చాలా తక్కువ బ్రాండ్లు మాత్రమే ఈ బనానా చిప్స్ అమ్మటంతో స్థానిక బేకరీలు, స్వీట్ షాపులపై వీటికోసం ఎక్కువగా ఆధారపడటాన్ని గ్రహించి దేశవ్యాప్తంగా క్వాలిటీ స్నాక్ ఆప్షన్ కింద ప్రజలకు బనానా చిప్స్ అందించాలని నిర్ణయించాడు.

అలా ప్రీమియం క్వాలిటీ చిప్స్ అందించటానికి బియాండ్ ఇండియా బ్రాండును నిర్మించాడు. అలా సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనే కోరికతో 2018లో తన కార్పొరేట్ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు. బనానా చిప్స్‌లో దేశీ మసాలా, పెరి పెరి, సాల్ట్ అండ్ బ్లాక్ పెప్పర్, హాట్ అండ్ స్వీట్ చిల్లీ, సోర్ క్రీం ఆనియన్, పార్స్లీ సాల్టెడ్ ఫ్లేవర్ వంటి రుచులతో అందుబాటులోకి తెచ్చాడు. వీటిని ప్రస్తుతం తాను పుట్టిపెరిగిన కేరళతో పాటు దేశంలోని అనేక ప్రాంతాలకు తన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చాడు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో రైతుల నుంచి స్నాక్స్ తయారీ కోసం అరటికాయలను సేకరిస్తున్నాడు.
ఈ బనానా చిప్స్ కొలెస్ట్రాల్, ట్రాన్స్ ఫ్యాట్ రహితమైనవి మానవ స్పర్శ లేకుండా ప్యాక్ చేయబడతాయని మధు పేర్కొన్నారు. ప్రస్తుతం తన కంపెనీ ఉత్పత్తులను అమెజాన్, బిగ్ బాస్కెట్, ఇండియా మార్ట్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో విక్రయించబడతాయి. దీనికి తోడు రిటైల్ సూపర్ మార్కెట్లలో కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం తన ఉత్పత్తులకు ముంబై, పూణే, మైసూర్, దిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ఎక్కువ కస్టమర్లను కలిగి ఉన్నట్లు వెల్లడించారు. అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్లో అమెరికా, యూఏఈ, ఖతార్, నేపాల్, మారిషస్‌లలో కూడా విక్రయాలను స్టార్ట్ చేసింది.
గత సంవత్సరం మానస్ మధు ఒక అడుగు ముందుకు వేసి షార్క్ ట్యాంక్ ఇండియా మొదటి సీజన్‌లో తన కంపెనీని పిచ్ చేసాడు. దీంతో కంపెనీకి చెందిన 2.5 శాతం ఈక్విటీని అమర్ గుప్తా, అష్నీర్ గ్రోవర్ ఏకంగా రూ.50 లక్షలకు దక్కించుకున్న మెుదటి వ్యాపారవేత్తగా నిలిచాడు. దీంతో అతని పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పరిచయం అయ్యింది. కొన్ని నెలల్లోనే మధు కంపెనీ ఉత్పత్తులు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో బెస్ట్ సెల్లర్‌గా మారింది. ప్రతి నెలా కంపెనీ రూ.కోటి విక్రయాలను చూస్తోందని మధు చెప్పారు. అలా తన చిన్నప్పటి స్నాక్స్ అందుబాటులో ఉన్న గ్యాప్ చూసిన మధు ప్రస్తుతం కోట్ల రూపాయల వ్యాపారంగా ఈ అవకాశాన్ని మార్చుకున్నాడు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications