Mufti Success Story: వేల కోట్ల వ్యాపారం పుట్టేది మనిషి మస్తిష్కంలోనే. అయితే దానిని ఎంత విజయవంతంగా ముందుకు తీసుకెళతారనే విషయం మాత్రం పూర్తిగా వారి వ్యక్తిగత సామర్థ్యాలపైనే ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలోనే వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలు కేవలం ఒక్క రోజులో కాకుండా నిరంతర శ్రమవల్ల సృష్టించబడుతుంటాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ప్రముఖ బ్రాండెడ్ దుస్తుల తయారీ సంస్థ ముఫ్తీ గురించే. దేశంలో పురుషుల ఫ్యాషన్ విభాగంలో కంపెనీ మంచి గుర్తింపును సాధించింది. వాస్తవానికి కంపెనీని కేవలం రూ.10,000 ప్రారంభ రుణంతో స్టార్ట్ చేశారు. అయితే కాలక్రమేణా ప్రస్తుతం కంపెనీ యాజమాన్యం దీనిని దేశంలో గుర్తింపు పొందిన పురుషుల దుస్తుల రిటైలర్ గా మారిపోయింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1,150 కోట్లకు పెరిగింది. ఈ ఘనత పూర్తిగా కంపెనీని ప్రారంభించిన వ్యవస్థాపకుడు కమల్ కుష్లానీకి దక్కుతుంది.

టీనేజ్ వయస్సులోనే తండ్రిని కోల్పోయిన వ్యవస్థాపకుడు కమల్ కుష్లానీ కుటుంబ ఆర్థిక కష్టాలను చిన్నతనంలోనే ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనికోసం పనిచేయటం ప్రారంభించాడు. అయితే ఫ్యాషన్ పట్ల ఆసక్తి, ప్రేమ ఉన్నప్పటికీ దానిపై దృష్టిసారించటానికి అవసరమైన నిధులు లేవు. ఉద్యోగం చేస్తున్నప్పటికీ దుస్తులను డిజైన్ చేస్తున్న తీరుపై స్నేహితులు, బంధువుల నుంచి ప్రశంసలు, ప్రోత్సాహం కొనసాగాయి. దీంతో ఎలాగైనా సొంత ఫ్యాషన్ బ్రాండ్ ప్రారంభించాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో దాదాపు 30 ఏళ్ల కిందట 1992లో తన అత్త వద్ద వ్యాపారం కోసం రూ.10,000 అప్పుగా తీసుకుని తన ఆలోచనకు కార్యరూపం ఇవ్వటం ప్రారంభించాడు. ఇంటి వద్దే ఉత్పత్తిని ప్రారంభించి Mr & Mr బ్రాండ్ కింద చొక్కాలను తయారు చేయటం ప్రారంభించాడు. క్లాత్ సోర్సింగ్ నుంచి ఉత్పత్తులను అమ్మటం వరకు అన్నింటినీ స్వయంగా చేపట్టడం మెుదలుపెట్టాడు. అలా ముందుకు సాగుతూ కంపెనీ పేరును 1998లో ముఫ్తీకి మార్చాడు. ఆ తర్వాత పురుషుల ఫ్యాషన్ విభాగంలో కంపెనీ సక్సెస్ ఆయనను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది.
అలా కంపెనీ 2000లో మొదటిసారిగా పురుషుల స్ట్రెచ్ జీన్స్‌ని ప్రవేశపెట్టి పెద్ద సక్సెస్ రుచిచూసింది. దేశంలో ఇలాంటి ఉత్పత్తిని ప్రజలకు మెుదటిసారిగా పరిచయం చేసిన బ్రాండ్ ముఫ్తీ కావటంతో యువత నుంచి భారీగా సానుకూల స్పందన కనిపించింది. ఈ విజయం ముఫ్తీని తన సొంత బ్రాండ్ అవుట్‌లెట్‌ని ప్రారంభించేలా ప్రేరేపించింది. కంపెనీ ప్రస్తుతం దేశంలో దాదాపు 380 రిటైల్ స్టోర్లను కలిగి ఉంది. అలాగే 1305 మల్టీబ్రాండెడ్ అవుట్‌లెట్లలో తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. సొంతంగా వ్యాపారాలను ప్రారంభించాలనుకుంటున్న నేటి తరం యువతకు ఈ స్టోరీ పెద్ద ప్రేరణను కలిగిస్తోంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications