Success Story: రూ.100తో ఊరు విడిచాడు.. ప్రస్తుతం రూ.200 కోట్లకు అధిపతి.. సక్సెస్ అంటే ఇదే..
Malay Debnath: జీవితంలో ఎలాగైన పురోగమించాలని కసి ఉంటే విజయం సాధించొచ్చని ప్రస్తుతం ఉన్నత శిఖరాలను అందుకున్న అనేక మంది చెప్పారు. ఇందుకు చదువు, ఇతర క్వాలిఫికేషన్లతో సంబంధం లేదని నిరూపించారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది మలయ్ దేబ్‌నాథ్ సక్సెస్ స్టోరీ గురించే. పశ్చిమ బెంగాలీ జిల్లా కూచ్ బెహార్‌లోని ఒక చిన్న గ్రామానికి చెందిన దేబ్‌నాథ్ కుటుంబం రాజకీయ వివాదం కారణంగా వారి వ్యాపారం అగ్నిప్రమాదంలో కాలిపోవడంతో పెద్ద విషాదాన్ని చవిచూసింది. అప్పుడు మలయ్ వయస్సు 6 ఏళ్లు. తిరిగి వ్యాపారాన్ని ప్రారంభించినప్పటికీ అది పుంజుకోలేదు. అలా అత్యంత గడ్డు కాలాన్ని వారి కుటుంబం చవిచూసింది.

దేబ్‌నాథ్ తన పాఠశాలతో పాటు గ్రామంలో తిరిగి తన కుటుంబానికి చెందిన చిన్న టీ వ్యాపారాన్ని చూసుకున్నాడు. 12వ తరగతి డిప్లొమా సంపాదించే వరకు ఇది మూడు సంవత్సరాలు కొనసాగింది. ఆ సమయంలో చదువును విడిచిపెట్టి తల్లి వద్ద రూ.100 తీసుకుని దిల్లీకి వెళ్లాడు. అలా రాజధాని నగరంలో క్యాటరర్ కోసం పని చేయడం ప్రారంభించాడు. అలా పాత్రలు క్లీన్ చేయటం, టేబుల్స్ తుడవటం వంటి పనులు చేశాడు. అలా పనితో యజమాని అభిమానాన్ని పొందాడు. దీంతో అతని వేతనం రూ.500 నుంచి రూ.3000కి పెరిగింది. ఇంటికి డబ్బు పంపించేందుకు రోజుకు 18 గంటలు పనిచేశాడు.
తర్వాత ఢిల్లీకి చెందిన ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలో సూపర్‌వైజర్‌గా ఎదిగాడు. ఈ క్రమంలో హోటల్ మేనేజ్‌మెంట్‌లో ఇండియన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కోర్సును పూర్తి చేశాడు. అలా పనిచేస్తున్నప్పుడు పరిచయాలు పెంచుకుని సొంతంగా క్యాటరింగ్ కంపెనీని ప్రారంభించాడు. అలా దేబ్‌నాథ్ క్యాటరర్స్ అండ్ డెకరేటర్స్ పెద్ద విజయాన్ని సాధించింది. దీంతో మంచి లాభాలను పొందాడు.
ప్రస్తుతం దేబ్‌నాథ్ సంస్థ దిల్లీ, పూణే, జైపూర్, అజ్మీర్, గ్వాలియర్‌లతో సహా 35 కంటే ఎక్కువ ఆర్మీ మెస్ సౌకర్యాలను నిర్వహిస్తున్నాడు. అతని విజయవంతమైన వ్యాపారం కారణంగా.. అతను ఉత్తర బెంగాల్‌లోని టీ తోటలతో సహా సుమారు రూ.200 కోట్ల నికర విలువను కలిగిన విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగారు. జీవితం ఎలాంటి కష్టాలను ఇచ్చిన అచంచలమైన కృషి, కసి, సంకల్పంతో విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగారు.


Click it and Unblock the Notifications