Success Story: ప్రపంచంలో అన్నింటి కంటే శక్తివంతమైనది కాలం. ఇది తలరాతలను మార్చేస్తుంది. కసి, అంకితభావంతో పనిచేసే వారిని వారు ఊహించిన గమ్యాలకు చేరుస్తుంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ముఖేష్ కుమార్ సక్సెస్ స్టోరీ గురించే. ముఖేష్ బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా శివదాస్‌పూర్ గ్రామంలో జన్మించాడు. అతను చిన్నతనంలో గడ్డితో నిర్మించిన పూరి పాకలో జీవించే వాడు. గట్టిగా వానపడితే ఎక్కడ కూలిపోతుందో అనే భయం ఉండేది. ఆ స్థాయి నుంచి వచ్చి ప్రస్తుతం ప్రజల సొంతింటి కలలను నెరవేరుస్తూ రియల్టీ రంగంలో ఎదిగాడు. ప్రస్తుతం అతను ఏడాదికి రూ.20 కోట్లను ఆదాయంగా సంపాదిస్తున్నాడు.

ముజఫర్‌పూర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముఖేష్ గ్రామం దాదాపు 6 నెలల పాటు వరద నీటిలో మునిగిపోయింది. గ్రామంలో కరెంటు, రోడ్డు సౌకర్యం లేదు. ఆ తర్వాత ముఖేష్ కుమార్ M-Sanvi రియల్ ఎస్టేట్ అనే కంపెనీని ప్రారంభించి ఫ్లాట్‌లను నిర్మించడం, విక్రయించడం, అద్దెకు ఇవ్వడం వంటి వ్యాపారాన్ని మెుదలు పెట్టాడు. వాస్తవానికి అతను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు. తన తండ్రి చదువుకోలేదని తనను కూడా ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసని అన్నాడు. అయితే తన చిన్న తనంలో కనీసం పుస్తకాలు కొనేందుకు కూడా డబ్బులు లేవని వెల్లడించాడు.
అప్పుగా తీసుకున్న డబ్బుతో చదువులు సాగాయని, పెద్దయ్యాక తన తండ్రి చదివించడానికి సిటీకి పంపారని ముఖేష్ గుర్తుచేసుకున్నారు. ఇందుకోసం నగరంలో కూలీగా పనిచేశాడని చెప్పాడు. అయితే తాను 10వ తరగతిలోనే ఫెయిల్ అయ్యానని అయితే తర్వాతి సంవత్సరం మళ్లీ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాడు. ఆ తర్వాత తండ్రి పొలాన్ని అమ్మి ముఖేష్ ను ఎంబీఏ చదివించాడు. అలా ఒక చిన్న ఉద్యోగం సంపాదించాడు.
ముఖేష్ మంచి మాటకారి. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రయత్నించమని కొందరు సూచించటంతో ఆ రంగంలోని ఒక కంపెనీలో చేరాడు. అలా వ్యాపారంలో అనుభవం రావటంతో 2015-16లో ఇద్దరు పాట్నర్లతో కలిసి సొంతంగా కంపెనీని ప్రారంభించాడు. అయితే కొన్ని కారణాల వల్ల అతడిని అదే కంపెనీ నుంచి తొలగించారు. దీని తర్వాత ముఖేష్ M-Sanvi పేరుతో తన సొంత కంపెనీని ప్రారంభించాడు. అలా అతని అదృష్టం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ప్రస్తుతం ముఖేష్ వార్షిక ఆదాయం రూ.20 కోట్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications