LuLu Group: మనలో చాలా మందికి సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తలు అనగానే ముందుగా గుర్తుకొచ్చేది అంబానీ, అదానీ, టాటా, బిర్లా వంటి వారే. అయితే కేరళకు చెందిన ఈ వ్యాపారవేత్త కంపెనీ ప్రస్తుతం దేశంలో భారీగా వార్తల్లో నిలిచింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది కేరళకు చెందిన బిలియనీర్ MA యూసఫ్ అలీ గురించే. గత ఏడాది ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లో యూసఫ్ 35వ అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఈయన కేరళలోని త్రిసూర్‌కు చెందినవారు. ప్రస్తుతం యూసఫ్ అలీ రిటైల్ దిగ్గజం లులు గ్రూప్ ఛైర్మన్, ఎండీగా కొనసాగుతున్నారు. ఈ సంస్థ మధ్యప్రాచ్యం, ఆసియా, యూఎస్, యూరప్‌లోని 23 దేశాల్లో వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు.

కంపెనీ ఏడాది వ్యాపారం రూ.66,000 కోట్లుగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలో 65,000 మందికిపైగా సిబ్బంది పనిచేస్తున్నారు. కేరళలోని అత్యంత సంపన్నులలో మొదటి స్థానంలో ఉన్న యూసఫ్ అలీ నికర విలువ 2022లో రూ.43,612.56 కోట్లుగా ఉంది. ప్రస్తుతం ఆయన నికర విలువ రూ.59,118 కోట్లుగా ఉంది. అలీ బిజినెస్ మ్యానేజ్మెంట్ అండ్ ఎడ్మినిస్టేషన్ లో డిప్లొమా కలిగి ఉన్నారు.
1973లో యూసఫ్ తన మామతో కలిసి చిన్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పనిచేయడానికి అబుదాబికి వెళ్లారు. ఆ తర్వాత 1990లలో లులు పేరుతో సూపర్ స్టోర్లను ప్రారంభించారు. LuLu గ్రూప్ యూఏఈ రాజధాని అబుదాబిలో ప్రధాన కార్యాలయం కలిగి ఉంది. షాపింగ్ కేంద్రాలు, హైపర్ మార్కెట్‌ల నెట్‌వర్క్ ద్వారా గల్ఫ్‌లో ఇది అత్యంత విస్తృతంగా గుర్తింపు పొందింది.
గతంలో లులు గ్రూప్ ప్రపంచ స్థాయి మాల్ ను ఏపీలోని సముద్రతీర నగరం విశాఖలో ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ తర్వాత నిర్ణయాన్ని విరమించుకుంది. ఆ తర్వాత ఇటీవల హైదరాబాదు కూకట్ పల్లి సమీపంలో ఏర్పాటు చేసిన మాల్ ప్రజల నుంచి విశేష స్పందనను పొందింది. దీని కారణంగా పెద్ద స్థాయిలో ట్రాఫిక్ జామ్స్ కూడా జరిగాయి.


Click it and Unblock the Notifications