Landcraft Agro Success: నేటి కాలంలో యువత ఐఐటీ, ఐఐఎం వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాయలయాల్లో చదువు పూర్తి చేసిన తర్వాత ఫ్యాన్సీ జాబ్ ఆఫర్స్ వచ్చినప్పటికీ వాటిని వదులుకుంటున్నారు. తమలోని వ్యాపార ఆలోచనలకు జీవం పోసేందుకు కృషి చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్నాయి. అలా స్టార్టప్ కల్చర్ అన్ని రంగాల్లోని కొత్త వ్యాపార అవకాశాలను టెక్నాలజీ ద్వారా ట్యాప్ చేసేందుకు నేటి యువత ఎక్కువగా ఆసక్తి చూపుతోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ల్యాండ్ క్రాష్ట్ ఆగ్రో సంస్థ సక్సెస్ స్టోరీ గురించే. దీనిని స్థాపించింది ఐఐటీ బంబేలో స్నేహితులైన మయాంక్ గుప్తా, లలిత్ ఝవార్. వాస్తవానికి మహారాష్ట్రలోని పశ్చిమ బెల్ట్, కొల్హాపూర్ జిల్లా బెల్లం, పాదరక్షలు, పర్యాటక ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది. కానీ ఇప్పుడు ఈ ప్రాంతం సేంద్రియంగా పండించిన విదేశీ కూరగాయలకు ప్రసిద్ధి చెందింది. ఈ క్రమంలో అక్వాపోనింగ్, హైడ్రోపోనింగ్ వంటి సాంకేతికతలతో దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో కూరగాయలను పండించటమే. ఇక్కడ పాలకూర నుంచి పుట్టగొడుకుల వరకు దాదాపు 40 వివిధ రకాల దేశీయ, విదేశీ ఆకుకూరలను ల్యాండ్ క్రాఫ్ట్ ఆగ్రో పేరుతో స్నేహితులు పండిస్తున్నారు.

మయాంక్ గుప్తా, లలిత్ ఝవార్ అనే ఇద్దరు స్నేహితులు ఐఐటీలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. మయాంక్ జిలింగో అనే కంపెనీని స్థాపించి 2012-2018 వరకు ఆగ్నేయాసియా అంతటా పర్యటించారు. లలిత్ 2011లో తన కుటుంబం టెక్స్‌టైల్ అండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో చేరాడు. 2018లో మయాంక్ ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఆ సమయంలోనే సేంద్రియ పద్ధతుల్లో పండించిన తాజా కూరగాయలను విక్రయించటాని ఇకామర్స్ ప్లాట్‌ఫారమ్ ప్రారంభించాలనే ఆలోచనను లలిత్‌తో చర్చించాడు. కొంత రీసెర్చ్ తర్వాత ఈ ఆలోచన సక్సెస్ కాదని వారు గ్రహించారు. ఈ క్రమంలో నాణ్యమైన సేంద్రియంగా పండించిన విదేశీ కూరగాయల రైతులు చాలా తక్కువగా ఉన్నారని వారు గుర్తించినట్లు మయాంక్ పేర్కొన్నాడు.
వినియోగదారులు, రైతుల మధ్య వారధిగా మారాలనుకున్నప్పటికీ చాలా తక్కువ మంది నాణ్యమైన ఉత్పత్తిదారులు మార్కెట్లో ఉన్నట్లు వారు గ్రహించారు. దీంతో వారిద్దరూ విదేశీ కూరగాయలను సొంతంగా పండించి విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం అవరసమైన నీరు, వాతావరణం, నేల వంటి వాటిని ఏర్పాటు చేసుకున్నారు. తమకు వ్యవసాయంలో ఎలాంటి ముందస్తు అనుభవం లేనప్పటికీ ఏప్రిలో 2019లో మిత్రులిద్దరూ కలిసి కొల్హాపూర్ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలోని ఇచల్‌కరంజిలో ల్యాండ్‌క్రాఫ్ట్ ఆగ్రోను ఏర్పాటు చేశారు. ల్యాండ్‌క్రాఫ్ట్ 20 ఎకరాల హైడ్రోపోనిక్స్, 3 ఎకరాల ఆక్వాపోనిక్స్ పొలాలలో 40 రకాల కూరగాయలను పండిస్తుంది. కూరగాయల సాగు కోసం 100 ఎకరాల భూమిని పాలీ హౌస్‌లుగా మార్చేందుకు దాదాపు 150 మంది రైతులకు శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం వారు తమ కూరగాయలు ట్రూగానిక్ బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్నారు.
ప్రస్తుతం ఈ స్టార్టప్ కంపెనీ నెల వ్యాపార టర్నోవర్ దాదాపు రూ.80 లక్షల కంటే ఎక్కువగా ఉంది. తొలినాళ్లలో తమకు వ్యవసాయంపై పట్టులేకపోవటం వల్ల కొన్ని తప్పులు చేశామని, అయితే వాటి నుంచి వేగంగా నేర్చుకుని ముందుకు సాగినట్లు ఈ మిత్రులు చెబుతున్నారు. ఈ క్రమంలో తాము చాలా పరిశోధనలను యాక్సెస్ చేశామని, తప్పులను సరిదిద్దుకోవటానికి సలహాదారులు, నిపుణులను సంప్రదించినట్లు వారు వెల్లడించారు. అలా సేంద్రియ పద్ధతుల్లో ఆహారాన్ని పండించటం నేర్చుకున్నట్లు తెలిపారు. ఇది వారికి కరోనా సమయంలో ప్రజలు మంచి ఆహారాలవైపు మరలటంతో మరింత సహాయం చేసిందన్నారు. రానున్న కాలంలో మరింత మంది రైతులతో కాంట్రాక్ట్ ఫార్మింగ్ కోసం చేర్చుకోవటంతో పాటు అనేక నగరాలకు చేరుకోవటానికి లాజిస్టిక్స్ మెరుగుపరుచుకునే పనిలో ఉన్నట్లు వారు చెబుతున్నారు.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications