Success Story: ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం మానేసిన మహిళా టెక్కీ.. లక్షల్లో సంపాదిస్తోంది..
Success Story: ఇప్పుడు ప్రపంచం మెుత్తం టెక్నాలజీపైనే పనిచేస్తోంది. వేగంగా పనులను పూర్తి చేసుకునేందుకు, జీవితాన్ని మరింతగా సులభతరం చేసుకునేందుకు విరివిగా వినియోగిస్తున్నారు. కానీ చాలా మంది ఈ ఉరుకుల పరుగుల నుంచి బయటపడుతూ టెక్ ఉద్యోగాలను విడిచిపెడుతున్నారు.
ఇందుకోసం లక్షల రూపాయల జీతాలను వదులుకుంటూ తమ కలల జీవితాన్ని నిర్మించుకునేందుకు సొంతంగా వ్యాపారాలను నిర్మిస్తున్నారు. ఈ కోవకు చెందిన మహిళే 27 ఏళ్ల కిరాతి అగర్వాల్. ఆమె సొంత వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ కంపెనీలో తన ఉద్యోగాన్ని మానేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన కిరాత్ ఐఐటీ ధన్‌బాద్‌లో విద్యను పూర్తి చేసిన తర్వాత ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరారు.

మంచి జీతంతో జీవితం సాఫీగా సాగిపోతోంది. అయినా ఆమె మనసు సొంతగా వ్యాపారం ప్రారంభించటంపైనే ఉంది. ఈ క్రమంలో ఆన్‌లైన్ మార్కెటింగ్ సేవలకు పెరుగుతున్న డిమాండ్ గమనించి.. తనకు తెలియని వ్యాపారంలోకి దిగారు. అలా ఆన్‌లైన్‌లో కంటెంట్‌ను పరీక్షించడం, పోస్ట్ చేయడం ప్రారంభించారు. తగిన నైపుణ్యాలను పొందేందుకు Coursera, Udemyలో ఆన్‌లైన్ మార్కెటింగ్‌కు సంబంధించిన అధికారిక కోర్సులను పూర్తి చేసింది. అలా ఈ రంగంలో ఫ్రీలాన్సర్‌గా ప్రయాణాన్ని ప్రారంభించి.. మార్చి 2022లో తన సొంత కంపెనీ మార్క్రేటింగ్ కేఫ్‌ను ప్రారంభించారు.
మెుదట్లో ఈ వ్యాపారంలో ప్రతిభావంతులైన బృందాన్ని సమీకరించడం, వ్యాపారాన్ని విస్తరించడం వంటి సవాళ్లను ఆమె ఎదుర్కొన్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, టార్గెటెడ్ అడ్వర్టైజింగ్‌తో సహా సమగ్ర సోషల్ మీడియా నిర్వహణ సేవలను అందించటంలో కంపెనీ ప్రత్యేకతను కలిగి ఉంది. అలా కిరాతీ అగర్వాల్ FY2023లో రూ.12 లక్షల ఆదాయాన్ని ఆర్జించారు. స్టార్టప్ ప్రారంభించినప్పటి నుంచి దాదాపు రూ.40 నుంచి 50 లక్షల వరకు సంపాదించి విజయపథంలో ముందుకు సాగుతున్నారు. లాభదాయకమైన వ్యాపారానికి సహనం కీలకమని ఆమె పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications