Sid's Farm Success: ప్రస్తుత కాలంలో ఐఐటీ, ఐఐఎం వంటి ప్రీమియం సంస్థల్లో విద్యను అభ్యసించిన తర్వాత చాలా మంది ఉద్యోగం వద్దు స్టార్టప్ ముద్దు అంటూ ముందుకు సాగుతున్నారు. ఎన్ని లక్షల జీతాలుగా పొందినా సొంత వ్యాపార కలను మాత్రం చాలా మంది అస్సలు వదలటం లేదు. స్టార్ట్ చేయటం లేట్ అవ్వచ్చుగానీ జాబ్ మాత్రం వద్దంటున్నారు.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది కిషోర్ ఇందుకూరి అనే తెలుగు వ్యక్తి సక్సెస్ స్టోరీ గురించే. హైదరాబాద్‌లోని మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన కిషోర్ పుట్టింది కర్ణాటకలో. హైదరాబాద్‌లో డెయిరీని ప్రారంభించేందుకు అమెరికాలోని ఇంటెల్‌లో లాభదాయకమైన ఉద్యోగానికి గుడ్‌బై చెప్పేశారు. విలాసవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి, తన అభిరుచిని నెరవేర్చుకోవడానికి సాధారణ జీవితాన్ని గడపాలనే నిర్ణయంతో దీనిని ప్రారంభించారు. కిషోర్ ఇందుకూరి నలంద విద్యాలయ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసి, లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశాలలో 12వ తరగతి పూర్తి చేశాడు. ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి కెమిస్ట్రీలో బీఎస్సీ చేశారు. తండ్రి మహీంద్రా అండ్ మహీంద్రాలో ఉద్యోగి కాగా, తమ్ముడు సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఖరగ్‌పూర్ ఐఐటీలో విద్య తర్వాత కిషోర్ అమెరికాలోని మసాచుసెట్స్ విశ్వవిద్యాలయానికి వెళ్లాడు.

కిషోర్ ఇందుకూరి భారతదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకునే వరకు ఇంటెల్ కార్పొరేషన్‌లో సీనియర్ ప్రాసెసింగ్ ఇంజనీర్‌గా పనిచేశాడు. ఆరేళ్ల పాటు పని తర్వాత.. హైదరాబాద్‌కు తిరిగి వచ్చి అనేక వ్యాపారాల్లో స్టార్ట్ చేశాడు. GRE, TOEFEL శిక్షణ నుంచి కూరగాయలు పండించటం వరకు వివిధ పనులు చేశాడు. ఈ క్రమంలో దేశంలో సురక్షితమైన పాలకు తక్కువ ఎంపికలు ఉన్నట్లు గమనించి 2012లో కేవలం 20 ఆవులతో డెయిరీని ప్రారంభించాడు. మొదట్లో కిషోర్ ఇందుకూరి పాలను హోల్‌సేల్ మార్కెట్‌లో విక్రయించాడు. అతను లీటరు రూ.15కి విక్రయించగా, ఖర్చు రూ.30 అవుతోందని గ్రహించాడు. అయితే ఆ తర్వాత కమ్యూనిటీ సెంటర్లు, హౌసింగ్ సొసైటీలను సందర్శించి ప్రజలతో కనెక్ట్ అయ్యారు. ప్రజలకు శుభ్రమైన పాల గురించి అవగాహన కల్పించాడు.

మెల్లగా ప్రజాధరణను పొందటంతో 2018 నాటికి ఇందుకూరి డెయిరీ ఫామ్ హైదరాబాద్‌లో అతిపెద్ద పాల సరఫరాదారుగా మారింది. అతని డెయిరీ ఫామ్ 1500 మంది రైతుల నుండి పాలను సేకరించి హైదరాబాద్, చుట్టుపక్కల 6,000 మంది వినియోగదారులకు 25,000 లీటర్లకు పైగా పాలను విక్రయిస్తున్నారు. సిద్స్ ఫార్మ్ పేరుతో కంపెనీ టర్నోవర్ ఏడాదికి రూ.44 కోట్లకు చేరుకుంది. కిషోర్ వ్యవసాయ క్షేత్రం సేంద్రీయ పనీర్, నెయ్యి, పెరుగు, గేదె పాలు, ఆవు పాలు వంటి అనేక రకాల ఉత్పత్తులకు కంపెనీ విస్తరిస్తోంది. షోర్ ఇందుకూరి హైదరాబాద్‌కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాబాద్‌లో 4 ఎకరాల పొలాన్ని కొనుగోలు చేశారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్, కేశంపేట, షాబాద్, షాద్‌నగర్, వనపర్తి, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో రైతుల నుంచి సేకరించిన పాలను రిఫ్రిజిరేటెడ్ ట్రక్కులలో పాలను పొలానికి రవాణా చేస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications