Success Story: సరదాగా స్టార్ట్.. ఇంటివద్దే రూ.90 లక్షలు ఆదాయం.. సూపర్ సక్సెస్ స్టోరీ
Mushroom Farming: ప్రస్తుత కాలంలో ఇంటి వద్ద ఇష్టమైన పనులు చేసుకుంటూ ఆదాయం పొందాలనుకుంటున్నారు. ఈ క్రమంలో నేటి తరం తమకు నచ్చిన హాబీలపై దృష్టి సారించి ఐటీ ఉద్యోగులు సంపాదిస్తున్న దాని కంటే ఎక్కువ రాబడిని అందుకున్నారు. ఈ క్రమంలో వారు తమ సమయాన్ని, కష్టాన్ని ఆస్వాధిస్తున్నారు. అయితే ఇవి సక్సెస్ అయిన తర్వాత వేలామందికి ఆదర్శంగా కూడా నిలుస్తున్నాయి.
సరదాగా ఇంటివద్ద ప్రారంభించిన పుట్టగొడుగుల పెంపకం ఈ కేరళ దంపతులను ధనవంతులుగా మార్చేసింది. ప్రస్తుతం వీరు వ్యాపారం ద్వారా ఏడాదికి రూ.90 లక్షల వరకు బిజినెస్ చేస్తున్నారు. 2007లో బాల్కనీలో పుట్టగొడుగుల పెంపకాన్ని హాబీగా దంపతులు మెుదలుపెట్టారు. తర్వాత అది వారికి భారీగా ఆదాయాన్ని తెచ్చిపెడుతూ లాభసాటి వ్యాపారంగా మారింది. 65 ఏళ్ల తంగచన్, 57 ఏళ్ల సీజీ లేటు వయస్సులో పుట్టగొడుగుల పెంపకంలో నిమగ్నమై వ్యాపారంతో భారీ విజయాన్ని చూస్తున్నారు.

వ్యవసాయ కుటుంబం నేపథ్యంలో నుంచి వచ్చిన ఇద్దరు సరదాగా ప్రారంభించారు. పుట్టగొడుగుల పెంపకంలో నిమగ్నమైన భార్యను చూసిన తంగచన్ కూడా ఆమెకు సహాయం చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ఉద్యోగం మానేసి పూర్తి సమయం పుట్టగొడుగుల పెంపకం చేపట్టారు. అలా 2007లో కూన్ ఫ్రెష్ పేరుతో మష్రూమ్ సేల్స్ కంపెనీని ఈ దంపతులు ప్రారంభించారు.
తొలినాళ్లలో ఇంట్లో వివిధ రకాల పుట్టగొడుగులను వారు పెంచారు. ఆ తర్వాత తమ ప్రాంత వాతావరణంలో ఎలా పెరుగుతాయి, పోషక విలువలపై అధ్యయనం చేశారు. ఈ క్రమంలో బాల్కనీలో రకరకాల పుట్టగొడుగులను పెంచారు. ఇటీవల వారు ఉత్తమ పుట్టగొడుగుల పెంపకం సంస్థగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అవార్డును కూడా గెలుచుకున్నారు.
అలా తమ ఏడాది అనుభవంతో, ఆత్మవిశ్వాసంతో సొంత వ్యవసాయ భూమిలో ప్రయాణాన్ని మెుదలుపెట్టారు. తొలినాళ్లలో రూ.50వేలు వెచ్చించి దాదాపు 600 మష్రూమ్ బెడ్లను నిర్మించి పుట్టగొడుగుల సాగును మెుదలుపెట్టారు. ప్రజల్లో పుట్టుగొడుగులను తినటం ద్వారా ఉండే ఆరోగ్య ప్రయోజనాలపై ప్రచారం చేస్తూ విక్రయాలను పెంచుకున్నారు. అలా ప్రజలకు పుట్టగొడుగులను తినవలసిన అవసరాన్ని ప్రజలకు తెలియజేయటంపై దృష్టి సారించారు.
ఈ క్రమంలో వారు మష్రూమ్ మోమోస్, మష్రూమ్ కట్లెట్స్, మష్రూమ్ శాండ్‌విచ్‌లు ఇలా మరెన్నో అమ్మడం ప్రారంభించారు. అలా తమ ప్రయాణంలో కూన్ వీటా అనే కొత్త ఉత్పత్తిని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. లూలూ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్‌లో తమ కంపెనీకి చెందిన పుట్టగొడుగులను అమ్మకానికి ఉంచారు. ప్రస్తుతం వారు పెంపకంపై ఇతరులకు శిక్షణ అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications