Success Story: మనందరికీ వ్యాపారం అనగానే ముందుగా గుర్తుకువచ్చేది అంబానీ, అదానీ, టాటా, బిర్లాలు మాత్రమే. కానీ వీరికంటే ముందరే గుజరాతీ యువకుడు అమెరికాలో అడుగుపెట్టిన సంగతి చాలా మందికి తెలియదు. వివరాల్లోకి వెళితే..
యూఎస్ వెళ్లాలనేది నేటి కాలంలో యువతకు ఉన్న అతిపెద్ద కల. కానీ చాలా కాలం కిందటే అమెరికా హోటల్ వ్యాపారంలో ముందుగా అడుగుపెట్టిన గుజరాతీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కష్టాలను లెక్కచేయక అలుపెరగని కృషితో గుజరాత్‌కు చెందిన కంజిభాయ్ మంజు దేశాయ్ హోటల్ వ్యాపారంలో రికార్డు సృష్టించిన తొలి భారతీయుడు ఆయన.

1940ల ప్రారంభంలో శాన్ ఫ్రాన్సిస్కో డౌన్‌టౌన్‌లోని గోల్డ్‌ఫీల్డ్ మోటల్‌ను దేశాయ్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత తన పటేల్ సంఘాన్ని అమెరికాకు ఆహ్వానించారు. హోటల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు వారిలో ఆసక్తిని ప్రేరేపించారు. అలా కష్టాలను పక్కకు నెడుతూ అమెరికాలో మంచి పేరు తెచ్చుకున్నారు.
దేశాయ్ 1937లో అమెరికాకు వలస వచ్చిన దేశాయ్.. ప్రారంభంలో వర్ణవివక్ష, చట్టవిరుద్ధమైన పౌరసత్వ పరిస్థితి, భాషా సమస్యలను ఎదుర్కోలేక ఇండియాకు తిరిగి వచ్చేయాలనుకున్నారు. అయితే అక్కడి పండ్ల తోటల్లో పనికి చేరారు. తక్కువ జీతం, చెల్లని పౌరసత్వంతో అనేక ఇబ్బందులు పడ్డాడు. అయితే 1940 పెరల్ హార్బర్ లో యూఎస్ నేవీని జపాన్ దళాలు నిర్మూలించటంతో దాడికి బయటపిన ఒక జపనీస్ హోటల్ మహిళా యజమాని తాను నడుపుతున్న మోటల్‌ను అలాగే వదిలేసి ఇంటికి తిరిగి రాగానే దేశాయ్‌కి ఇచ్చింది. ఆ తర్వాత హోటల్‌ను నడిపిన దేశాయ్, మొదట్లో సింగిల్ రూమ్‌లను మాత్రమే అద్దెకు తీసుకున్నారు.
హోటళ్లను లీజుకు తీసుకునే ప్రయత్నంలో గుజరాతీ పటేళ్లను నిమగ్నం చేశాడు. పటేళ్లు లీజుకు మరిన్ని హోటళ్లను నడపడం ప్రారంభించారు. దీని కోసం గంజీభాయ్ మంజు దేశాయ్ పెద్ద పోరాటానికి నాయకత్వం వహించాల్సి వచ్చింది. అయినప్పటికీ విసుగు చెందకుండా అనేక మోటళ్లను కొనుగోలు చేశాడు. అతిథిదేవోభవ అనే భారతీయ సాంప్రదాయంతో వ్యాపారాన్ని శ్రద్ధగా నిర్వహిస్తూ విజయం సాధించాడు.


Click it and Unblock the Notifications