Jyothi Reddy: ఒక మహిళ సొంతగా వ్యాపారాన్ని ప్రారంభించి దానిని విజయవంతంగా ముందుకు నడిపించటం అంత సులువు కాదు. చిన్ననాటి నుంచి అనేక కష్టాలను అధిగమించిన తెలుగు మహిళా వ్యాపారవేత్త విజయగాథ ఇది..

అనేక కష్టాలన్నింటినీ అధిగమించి బిలియన్ డాలర్ల సాఫ్ట్‌వేర్ కంపెనీకి సీఈవోగా మారారు జ్యోతిరెడ్డి. రోజువారీ కూలీ అయిన ఆమె తండ్రి 5 మంది పిల్లలను పోషించలేక జ్యోతిని అనాథాశ్రమంలో వదిలేశాడు. అలా అక్కడ చదివించి 16వ ఏట పెళ్లి చేశాడు. అయితే 18 ఏళ్ల వయస్సులో ఇద్దరు పిల్లలతో పేదరికం కారణంగా ఆమె రూ.5కు వ్యవసాయ కూలీగా పనిచేశారు. ఈ క్రమంలోని అదృష్టవశాత్తూ కేంద్ర ప్రభుత్వ పథకం కింద టీచింగ్ ఉద్యోగం వచ్చింది.

వచ్చిన జీతం డబ్బు సరిపోక రాత్రిళ్లు టైలరింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని జ్యోతి పోషించారు. అలా రోజులు గడుపుతూనే 1994లో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి బీఏ పూర్తి చేసింది. ఆ తర్వాత 1997లో కాకతయ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. అలా అమెరికాకు చెందిన బంధువు ద్వారా జీవితంలో పెద్ద మలుపు వచ్చింది. అమెరికాలో ఉద్యోగం కోసం జ్యోతి కంప్యూటర్ కోర్సులు పూర్తి చేసి యూఎస్ వెళ్లింది.

అయితే అమెరికాలో జీవించటం అంత సాఫీగా సాగలేదు. మెుదట్లో పెట్రోల్ బంకుల్లో పనిచేసింది. ఆ తర్వాత ఆయాగా మారి చిన్న ఉద్యోగాలతో మనుగడ సాగించింది. ఆ తర్వాత 'రిక్రూట్‌మెంట్ ప్రొఫెషనల్'గా ఉద్యోగం సంపాదించింది. ఈ క్రమంలోనే అమెరికాలో 'కీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్' పేరుతో తన స్వంత సంస్థను జ్యోతి ప్రారంభించింది. క్రమంగా ఆమె కంపెనీ 15 మిలియన్ డాలర్ల టర్నోవర్ మార్కును సాధించింది. 2017లో సంస్థ విలువ ఏకంగా బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంది. అలా కష్టాలను అధిగమించిన జ్యోతిరెడ్డి ప్రస్తుతం అనేక మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.


Click it and Unblock the Notifications