Prem Watsa Success: గడచిన కొన్ని దశాబ్ధాలుగా భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం కెనడాకు వెళుతున్న సంగతి తెలిసిందే. అయితే అలా కెనడాకు వెళ్లిన ఐఐటీ గ్రాడ్యుయేట్ వి ప్రేమ్ వాట్సా ప్రస్తుతం కెనడాలో అత్యంత సంపన్నుడిగా మారారు. ఆయన ఐఐటీ మద్రాసులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
ప్రస్తుతం ప్రేమ్ వాట్సా కెనడాలో స్థిరపడిన భారతీయ సంపన్నుడు. పైగా సంపన్న వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. వాస్తవానికి వాట్సా హైదరాబాదులో జన్మించారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాట్సా ఐఐటీ మద్రాసులో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. దీని తర్వాత ఓంటారియా కెనడాలో పై చదవుల కోసం వెల్లారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా విదేశాలకు వెళ్లటం చాలా కష్టంగా నడిచింది. ఆ సమయంలో కేవలం జేబులో 8 డాలర్లతో ప్రయాణాన్ని కొనసాగించారు. అయితే తన చదువును కొనసాగించటం కోసం కెనడాలో ఎయిర్ కండిషనర్లు, ఫర్నేసులు వంటి వస్తువులను అమ్మటం ప్రారంభించారు.

అయితే అలా కెనడాలో తన జీవితం కొనసాగుతున్న సమయంలోనే నష్టాల్లో ఉన్న కెనడియన్ కంపెనీని కొనుగోలు చేసి దాని పేరును ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ గా మార్చారు. 1985లో కంపెనీకి సీఈవోగా మారగా ఇప్పటికీ అదే స్థానాన్ని కొనసాగిస్తున్నారు. మెుదటి 15 ఏళ్లుగా కంపెనీని వృద్ధి బాటలో నడిపించి మల్టీబిలియన్ డాలర్ల స్థాయికి చేర్చారు. 2012లో కంపెనీ ఆదాయం 8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారతీయ కరెన్సీ ప్రకారం రూ.65,717 కోట్లుగా నమోదైంది. భారతీయ ప్రభుత్వం వాత్సాను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అలాగే కెనడా తన అత్యుత్తమ పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ కెనడాతో సత్కరించింది.
ప్రస్తుతం ప్రేమ్ వాట్సా నికర విలువ దాదాపు రూ.17,430 కోట్లుగా ఉంది. అతను కెనడా వ్యాపార రంగంలో ప్రత్యేకంగా నిలిచారు. కెనడాలో ఉత్తమ వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ వాట్సా భారతీయ బిలియనీర్లు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి వీటితో పోటీపడే స్థాయిలో లేరు. వృత్తిపరమైన ప్రయాణాన్ని చూస్తే 1974లో కాన్ఫెడరేషన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ప్రారంభమైంది. అక్కడ అతను పెట్టుబడి నిర్వహణలో విలువైన అనుభవాన్ని నేర్చుకున్నాడు. దీని తర్వాత హాంబ్లిన్ వాట్సా ఇన్వెస్ట్‌మెంట్ కౌన్సెల్ లిమిటెడ్‌ను సహ-స్థాపించాడు. 1985లో ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌పై నియంత్రణను తీసుకున్నాడు.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క ఏరియాలోనే ఇల్లు కావాలంటున్న కొనుగోలుదారులు..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications