Indiamart Story: ప్రస్తుత కాలంలో సొంతంగా వ్యాపారం చేయాలనే ఆశ, పట్టుదల ఉన్న వ్యక్తులకు స్టార్టప్ ఎకోసిస్టమ్‌తో అనేక ఆర్థిక అవకాశాలు అందుతున్నాయి. అయితే ఇవేమీ లేని కాలంలో పట్టుదల అనే ఆయుధంతో పైకి ఎదిగిన వ్యక్తుల విజయగాథలు నేటితరం వ్యాపారవేత్తలకు పెద్ద మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది దేశంలోని ప్రముఖ ఆన్ లైన్ B2B వెబ్‌సైట్ ఇండియామార్ట్ గురించే. ఇది హోల్ సేల్ వ్యాపారులను చిన్న వ్యాపారులకు అనుసంధానించటంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ కంపెనీని దేశంలో ఇంటర్నెట్ వ్యాప్తి ఎక్కువగా లేని రోజుల్లోనే దినేష్ అగర్వాల్ అందుబాటులోకి తీసుకొచ్చారు. దినేష్ అగర్వాల్ అమెరికాలో ఉద్యోగాన్ని వదిలేసి స్వదేశానికి వచ్చిన తర్వాత ఇండియా మార్ట్ కంపెనీని 1995లో స్థాపించాడు. ఐటీ పరిశ్రమలో ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా ఉన్న హెచ్‌సిఎల్ కంపెనీలో అమెరికాలో పనిచేశాడు.

వాస్తవానికి అమెరికా వెళ్లటమే కలగా చాలా మంది యువత ప్రయత్నిస్తుంటారు. అధిక జీతాలు, ఆధునిక జీవన శైలి, ఐటీ పరిశ్రమలో డ్రీమ్ జాబ్ మానేసి రావటానికి సహజంగా ఎవ్వరూ ఇష్టపడరు. అయితే దినేష్ మాత్రం వీటికి భిన్నంగా తన ఉద్యోగాన్ని వదులుకుని సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించారు. తొలుత కేవలం రూ.40 వేల పెట్టుబడితో దినేష్ తన సోదరుడు ప్రజేష్ కలిసి ఇండియా మార్ట్ కంపెనీని ప్రారంభించారు. అప్పట్లో వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరిస్తూ.. భారతీయ ఎగుమతిదారులను ప్రపంచ మార్కెట్‌తో అనుసంధానించే లక్ష్యంతో దీని రూపకల్పన జరిగింది.
కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి 2001 వరకు గుమతిదారులు తమ ఉత్పత్తులను ఇండియామార్ట్ సైట్‌లో ఉచితంగా లిస్టింగ్ చేసుకునేందుకు ఇండియామార్ట్ అవకాశాన్ని అందించింది. తద్వారా ఇండియా మార్ట్ ప్లాట్‌ఫాం వివిధ కంపెనీలకు ఆన్‌లైన్ అమ్మకాల అవకాశాన్ని కల్పించింది. ఆ తర్వాత కంపెనీ తన ప్రస్థానంలో పెద్ద ఒడిదొడుకులను చూసింది. ప్రధానంగా 2008 ఆర్థిక మాంద్యం సమయంలో ప్రపంచం అతలాకులతమైన సంగతి తెలిసిందే. అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలటంతో ఆ ప్రభావం ఇండియా మార్ట్ కూడా చూసింది. వ్యాపారం తలకిందులు కావటంతో కంపెనీ అంతర్జాతీయ మార్కెట్ నుంచి దేశీయ మార్కెట్‌పై దృష్టి సారించటం మెుదలుపెట్టింది.
వేగవంతమైన విస్తరణలో భాగంగా కంపెనీ కేవలం 52 వారాల్లోనే 52 కొత్త కార్యాలయాలను ప్రారంభించింది. అనేక మంది వ్యాపారులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి వారికి నేరుగా కలిసేందుకు ఆన్ లైన్ మార్కెట్ మాదిరిగా ప్లాట్‌ఫారమ్ పనిచేస్తోంది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాప్ ఏకంగా రూ.18,765 కోట్లకు చేరుకుంది. అలాగే వ్యవస్థాపకుడు దినేష్ అగర్వాల్ సంపద రూ.5,000 కోట్లుగా ఉంది. నేటితరం వ్యాపారవేత్తలను ప్రోత్సహించే క్రమంలో దినేష్ అగర్వాల్ 45 స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారు.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications