Polycab News: పేదరికంలో కష్టాలను అనుభవిస్తూ సంపన్నులు మారే ప్రయత్నం చేయటం అంత సులువైనది కాదు. అయితే పట్టుదలతో పనిచేస్తే విజయం సాధించటం కష్టం కాదని ఒక వ్యక్తి నిరూపించారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఇందర్ జైసింఘాని గురించే. జీవితంలో ఎన్నో కష్టాలను అధిగమించి రూ.79,700 కోట్ల కంపెనీకి చైర్మన్‌గా మారారు. ఈ ప్రయాణంలో ఆయన ఓపికతో ముందుకు సాగారు. జైసింఘానికి 15 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు 1968లో తండ్రిని కోల్పోయారు. ఆ సమయంలో తండ్రి వ్యాపారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోదరులు, తల్లి బాధ్యతలు చిన్న వయస్సులోనే అందిపుచ్చుకోవాల్సి వచ్చింది.

అలా తండ్రి ముంబైలోని లోహర్ హౌసింగ్ ఎస్టేట్‌లో ఎలక్ట్రికల్ దుకాణాన్ని చూసుకోవటం ప్రారంభించారు. అలా సోదరులతో కలిసి 1983లో పాలిక్యాబ్ ఇండియా పేరుతో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. 2014లో కంపెనీ స్విచ్‌లు, స్విచ్ గేర్లు, ఎలక్ట్రిక్ ఫ్యాన్లు, ఎల్‌ఈడీ లైట్ల తయారీని ప్రారంభించింది. మెుదట్లో వారు చిన్న గ్యారేజీలో వైర్ల తయారీని మెుదలుపెట్టారు.
ఆ తర్వాత గుజరాత్‌లో ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేశారు. PVC ఇన్సులేటెడ్ వైర్స్ అండ్ కేబుల్స్ తయారీని ప్రారంభించారు. ఆ తర్వాత అనేక రకాల కేబుల్స్, పవర్ కేబుల్స్, కంట్రోల్ కేబుల్స్, బిల్డింగ్ వైర్లు, కమ్యూనికేషన్ కేబుల్స్ ఉత్పత్తి చేశారు. భారత, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఇందర్ జైసింఘని వీటిని ఉత్పత్తి చేయటంతో వ్యాపారం అభివృద్ధి చెందటం ప్రారంభించింది.

2008లో కంపెనీ ప్రపంచ బ్యాంకు అందించే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి నిధులు పొందింది. కంపెనీ ప్రయాణాన్ని గమనిస్తే.. 2014లో ఎల్‌ఈడీ లైట్లు, స్విచ్‌లు, ఎలక్ట్రిక్ ఫ్యాన్‌ల వంటి ఉత్పత్తులను తన పోర్ట్‌ఫోలియోకు జోడించింది. ఆ తర్వాత 2019లో కంపెనీని స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో జాబితా చేశారు. 2021లో జైసింఘని దేశంలోని ఫోర్బ్స్ అత్యంత సంపన్నుల జాబితాలో నిలిచారు. ఇప్పుడు ఆయన నికర విలువ రూ.53,000 కోట్లుగా ఉండగా.. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.79,700 కోట్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications