Success Story: అమ్మచేతి రుచిని నమ్ముకున్నారు.. రూ.3000 కోట్ల విలువైన కంపెనీని నిర్మించారు..
iD Fresh Story: మూడు పూట్ల ఐదువేళ్లు నోట్లోకి వెళితే చాలు అనుకునే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబంలో పుట్టిన వ్యక్తి పీసీ ముస్తాఫా. తాను పుట్టి పెరిగిన కేరళలోని వైనాడ్ నుంచి విద్య కోసం ఆ తర్వాత ఉద్యోగం కోసం బయటకు వచ్చి ప్రపంచాన్ని చూడటం ప్రారంభించాడు.
తనను చదివించేందుకు తల్లిదండ్రులు ఒక పూట భోజనం మానేటి డబ్బులు దాచటం, తన తాతలు సైతం మనుగడకు కష్టాలు పడటం చూసిన వ్యక్తి. అయితే ఒక సమస్య నుంచి పుట్టిన పరిష్కార మార్గమే iD Fresh కంపెనీ. భారతీయులు కేవటం ఫ్రెష్ ఇండ్లీ, దోశపిండిని మాత్రమే వినియోగించేందుకు ఇష్టపడతారని తెలిసి.. దానిని సరైన పద్ధతిలో ముందుకు తీసుకెళ్లి గొప్ప విజయాన్ని సాధించి చూపించారు.

అరబ్ దేశాల నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత.. 2005లో బెంగళూరులో ఎంబీఏ చదువుతున్న సమయంలో ముస్తాఫా తన కజిన్స్ షంసుదీన్ టికె, అబ్దుల్ నాజర్, జాఫర్ టికె, నౌషాద్ ప్రారంభించారు. వారితో పాటు కొంత పెట్టుబడి పెట్టి తిప్పసంద్రలో 50 చదరపు అడుగుల వంటగది నుంచి ఇడ్లీ-దోస పిండిని తయారు చేసి అమ్మటం ప్రారంభించారు. అయితే అది తొలుత నష్టాలను తెచ్చిపెట్టింది. అయితే పట్టు వదలక ముందుకు సాగుతున్న సమయంలో 1000 కేజీల పిండిని రోజుకు విక్రయించే స్థాయికి చేరుకోవటంతో ఆత్మవిశ్వాసం పొంది తమ వ్యాపారం విజయం సాధించగలదని వారు నమ్మారు.
ప్రస్తుతం కంపెనీ కాఫీ, పరోటా, చపాతీ, ఇడ్లీదోశ పిండి, నూడిల్స్, పెరుగు, పన్నీరు వంటి ఉత్పత్తులను విక్రయిస్తోంది. దేశంలోని 5 ప్రధాన నగరాల్లో కంపెనీ తన తయారీ కేంద్రాలను కలిగి ఉంది. అక్కడి నుంచి ఇతర నగరాలకు సైతం విస్తరించి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం కంపెనీ వార్షిక టర్నోవర్ రూ.600 కోట్లకు చేరుకోగా.. వ్యాపార విలువ రూ.3,000 కోట్లకు చేరుకుంది. ఒకనొక సమయంలో ఉద్యోగులకు 6 నెలల పాటు జీతాలు చెల్లించలేని స్థితిని సైతం కంపెనీ ఎదుర్కొని దాని నుంచి బయటపడగలిగింది.
సుమారు రూ.50,000 పెట్టుబడితో మెుదలైన కుటుంబ వ్యాపారం మూడేళ్లలో బ్రేకీవెన్ అందుకోగలిగింది. ఈ క్రమంలో కంపెనీ సాంకేతికతను విరివిగా వినియోగించుకుంటూ నష్టాలను భారీగా తగ్గించుకోగలిగింది. ప్రస్తుతం కంపెనీ రోజుకు దేశవ్యాప్తంగా దాదాపు లక్ష కేజీల ఇడ్లీదోశ పిండిని రోజూ దేశవ్యాప్తంగా విక్రయిస్తోంది. ప్రస్తుతం కంపెనీ ప్రమాదరక కెమికల్స్ లేని మైదా, గోధుమపిండితో నూడిల్స్ తయారీని ప్రయోగాత్మకంగా ఇప్పటికే ప్రారంభించింది. కంపెనీ రానున్న మూడేళ్లలో ఐపీవోను మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తోంది.


Click it and Unblock the Notifications