GreenFortune Success: నేటి యువతరం ఒకడి కింద పనిచేయటం ఏంటి మనమే 10 మంది ఉపాధి అవకాశం కల్పించాలని అనే బిజినెస్ మైండ్సెంట్ తో ఉన్నారు. దీనికి తోడు భారత ప్రభుత్వం కూడా స్టార్టప్స్, ఎమ్ఎస్ఎమ్ఈలను ప్రోత్సహించటంతో చాలా మంది ఔత్సాహిక వ్యాపారవేత్తలు తమ ఆలోచనలను ఆచరణలోకి తెస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు యువత కూడా తామేమీ పోటీలో వెనకపడలేదు అని తమ వ్యాపారదక్షతను చూపిస్తూ చూపిస్తూ సక్సెస్ రుచిచూస్తున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది హైదరాబాద్‌కు చెందిన విండో అండ్ డోర్ బ్రాండ్ గ్రీన్‌ఫార్చ్యూన్ సక్సెస్ స్టోరీ గురించే. ఈ కంపెనీని ప్రారంభించింది హైదరాబాదుకు చెందిన వ్యక్తి దిలీప్. వాస్తవానికి దిలీప్ ఐఐటీ కలకత్తాలో ఎంబీఏ పూర్తి చేశారు. ఈ క్రమంలో అందరి లాగానే మంచి జీతం ఆఫర్ చేసే కంపెనీలో ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా యాక్సెంచర్ కంపెనీలో తన ప్రయాణాన్ని స్టార్ట్ చేశాడు. దీని తర్వాత ప్రఖ్యాత సంస్థ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌లో హై పేయింగ్ జాబ్ కూడా కొట్టాడు. కానీ ఒక దశలో అతనికి ఇవేమీ కిక్ ఇవ్వలేకపోయాయి. దీంతో సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచనతో విండో అండ్ డోర్ బ్రాండ్ గ్రీన్‌ఫార్చ్యూన్ స్థాపించాడు. ప్రస్తుతం కంపెనీ B2B, B2C కస్టమర్‌లకు సేవలు అందిస్తోంది. పైగా అంతర్గతం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా ప్రత్యేకతను సంపాదించుకుంది.

కంపెనీ 2023లో ఫండ్ రైజింగ్ ద్వారా రూ.8.5 కోట్ల సీడ్ ఫండ్ పొందింది. దేశంలో వేగంగా నిర్మాణ రంగం ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న వేళ నాణ్యమైన వస్తువుల విషయంలో కొన్ని అంతరాయాలు ఉన్నట్లు దిలీప్ గుర్తించారు. దీనిని పూడ్చటానికి ప్రయాణం మెుదలుపెట్టడంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇంటి నిర్మాణంలో భారతీయుల అనుభవాన్ని మార్చాలని నిర్ణయించుకుని డోర్ అండ్ విండో బ్రాండ్ గ్రీన్‌ఫార్చ్యూన్‌ను ప్రారంభించాడు. అయితే మార్కెట్లో చాలా మంది ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. అసలు దిలీప్ సక్సెస్ మంత్రా మాత్రం అంతర్గతంగా ఏర్పాటు చేయబడిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పై ఎక్కువగా దృష్టి సారించటమే. సరసమైన ధరలకు నాణ్యమైన మెటీరియల్స్ అందించటానికి ఇది తోడ్పడిందని ఆయన పేర్కొన్నారు.
గ్రీన్‌ఫార్చ్యూన్ తన ప్రయాణంలో భారత వాతావరణానికి అనుగుణంగా తయారీ పదార్థాలను ఉపయోగించటంపై ఫోకస్ పెట్టడం కస్టమర్లను ఆకట్టుకుంది. తొలినాళ్లలో కేవలం ఇద్దరితో ప్రారంభమైన కంపెనీలో తర్వాత దిలీప్ భార్య ప్రత్యూష కూడా కో-ఫౌండర్‌గా చేరారు. తాము ఎక్కువగా కస్టమర్ రిఫరెన్స్ ద్వారా వ్యాపారాన్ని పొందినట్లు దిలీప్ పేర్కొన్నాడు. దీంతో కంపెనీ ప్రస్తుత దేశంలో ఆధారితమైన uPVC కిటికీలు, తలుపుల తయారీలో ప్రముఖ భారతీయ బ్రాండ్‌ల్లో ఒకటిగా గుర్తింపును సాధించింది. కస్టమర్లకు తమ ఉత్పత్తుల నాణ్యత, వాడే మెటీరియల్స్ గురించి ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత రిటైల్ కస్టమర్‌లు, కార్పొరేట్ కార్యాలయాలు, నివాస భవనాలు, ప్రభుత్వ ప్రాజెక్టులు, దేవాలయాలకు ఉత్పత్తులను అందిస్తున్న కంపెనీ రానున్న కొన్నాళ్లలో రూ.250 కోట్ల వ్యాపారాన్ని అందుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని దిలీప్ తెలిపారు.
More From GoodReturns

హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క ఏరియాలోనే ఇల్లు కావాలంటున్న కొనుగోలుదారులు..

LIC ఏజెంట్ నుంచి రూ. 40,000 కోట్ల సామ్రాజ్యం వరకు.. ఈయన ప్రయాణం అద్భుతం!

Hyderabad: హైదరాబాద్‌లో ఇళ్ల ధరల విస్ఫోటనం..! చిన్నగా మారుతున్న అపార్ట్మెంట్లు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?



Click it and Unblock the Notifications