Success Story: రూ.80తో మెుదలై లక్షల్లో సంపాదిస్తున్న మహిళ.. హైదరాబాదీ సక్సెస్ స్టోరీ
Anjum's Kitchen Success: ఒక మహిళ సొంత కాళ్లపై వ్యాపారాన్ని ప్రారంభించి ఎదగటం అంత సులువైన వ్యవహారం కాదు. చేతిలో వంద రూపాయల కంటే తక్కువ సొమ్ముతో వ్యాపారం ప్రారంభించి నెలకు లక్షల్లో ఆదాయం పొందే స్థాయికి దానిని తీసుకెళ్లటం వెనుక పెద్ద ప్రయాణం ఉంటుంది. అలాంటి పక్కా హైదరాబాదీ మహిళ సక్సెస్ స్టోరీ గురింతి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది నాజ్ అంజుమ్ సక్సెస్ స్టోరీ గురించే. వాస్తవానికి ఆమె వివాహం తర్వాత 2010లో హైదరాబాద్ నగరానికి మకాం మార్చారు. వాస్తవానికి ఆమె ఒక టెక్స్‌టైల్ ఇంజనీర్. అయితే ఆమెకు వంటలంటే మక్కువ. అలా ఆమె బిల్డింగ్ లోని బ్యాచిలర్స్, ఇరుగుపొరుగు వారికి ఆమె చేసే వంటలు బాగా నచ్చేవి. వారి ప్రశంసలు నాజ్ అంజుమ్ తన వంట ప్రతిభను వ్యాపారంగా మార్చేలా తర్వాతి కాలంలో ప్రోత్సహించాయని ఆమె చెప్పారు.

సాయంత్రం కూరల కోసం భవనంలో నివసింజే బ్యాచిలర్స్ రుచికరమైన వంటకాల కోసం నాజ్‌ను సంప్రదించడం ప్రారంభించారు. వారి అభిమానం పెరిగేకొద్దీ వివిధ రకాల ఆర్డర్‌లు పెరిగాయి. చివరికి రోజువారీ టిఫిన్‌ల కోసం అభ్యర్థనలు వచ్చాయి. ఈ సానుకూల మద్ధతుతో 2016లో ప్రేరేపించబడిన నాజ్ తన ఇంటి నుంచే 'అంజూమ్స్ కిచెన్' పేరుతో క్లౌడ్ కిచెన్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. బిర్యానీ అంటే మక్కువ ఉన్న ఆమె కేవలం ఆ సమయంలో రూ.80 పెట్టుబడిగా తన ప్రయాణాన్ని నిరాడంబరంగా మెుదలుపెట్టారు.
2016లో రంజాన్ మాసంలో నాజ్ వంటల ప్రయాణం పెద్ద మలుపు తిరిగింది. ఆమె చేసిన 'డబుల్ కా మీఠా', 'లౌకీ హల్వా' వంటి ప్రత్యేక డెజర్ట్‌లు పెద్ద విజయం సాధించాయి. ఆ తర్వాత ఆమె పొందిన HITEC సిటీలో ఒక చిన్న సమావేశానికి మటన్ దమ్ బిర్యానీ అధికారికంగా మెుదటి ఆర్డర్. దీని తర్వాత వరుస ఆర్డర్లు రావటం ఆమె బిర్యానీకి ప్రజాదరణను సృష్టించింది. ఈ ప్రయాణంలో 'అంజమ్స్ కిచెన్' వేగంగా హైదరాబాద్‌లోని మహిళల యాజమాన్యంలోని క్లౌడ్ కిచెన్‌లలో అగ్రగామిగా మారింది. రోజువారీ టిఫిన్‌లు, బిర్యానీలు, పార్టీ ఆర్డర్‌లు, డెజర్ట్‌లకు ఇది విస్తరించింది. అలా మౌత్ పబ్లిసిటీతో పాటు సోషల్ మీడియాలో ఆమె వంటల గురించి వ్యాప్తి వ్యాపారాన్ని పెంచింది.
ఈ అతిపెద్ద జర్నీ తర్వాత ప్రస్తుతం 'అంజూమ్స్ కిచెన్' ఒక అభివృద్ధి చెందుతున్న పాకశాస్త్ర సంస్థగా మారింది. 25-50 రోజువారీ ఆర్డర్‌లను అందుకుంటూ నాజ్ నెలకు దాదాపు రూ.లక్ష ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలో భారీగా ఆర్డర్లు పొందారు. హైదరాబాద్ వాసులకు ఆరోగ్యకరమైన ఇంటి రుచులను అందించేందుకు తమ అన్వేషణ నిరంతరం కొనసాగుతుందని నాజ్ చెబుతున్నారు. నాజ్ అంజుమ్ టెక్స్‌టైల్ ఇంజనీర్ నుంచి విజయవంతమైన క్లౌడ్ కిచెన్ యజమానిగా చేసిన ప్రయాణం నిజంగా ఆమె వంటలను రుచిచూసి ప్రోత్సహించిన అనేకమందితో పాటు ఆమె మైగ్రేషన్‌కు దక్కుతుంది.


Click it and Unblock the Notifications