Success Story: సైకిల్ నుంచి ప్రారంభమైన వ్యాపారం.. నేడు రూ.80 వేల కోట్ల సామ్రాజ్యం..
Hero Honda: ఇష్టపడి జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదలతో పనిచేసే వాడి పక్కనే ఉంటుంది బాస్ విజయం. దీనిని భారతదేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తలు ఇప్పటికే అనేక మార్లు నిరూపించారు. కసితో కదిలితే విజయం తధ్యమని ఈ స్టోరీ చెబుతుంది.
దేశంలో ప్రస్తుతం ఉన్న వాటిలో చాలా కంపెనీలు దేశానికి స్వాతంత్ర్యం రాకముందే ప్రారంభించబడ్డాయి. అలా పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన బ్రిజ్‌మోహన్ లాల్ ముంజాల్ తన ముగ్గురు సోదరులతో కలిసి 1944లో చిన్న సైకిల్ విడిభాగాల కంపెనీని మెుదలు పెట్టారు. తర్వాత దానిని లుథియానాకు మార్చారు. ఆ తర్వాత 1954లో వారు ప్రాథమిక సైకిల్ ఉపకరణాలను తయారు చేసే హీరో సైకిల్ లిమిటెడ్‌ను స్థాపించారు.

అలా బ్రిజ్మోహన్ లాల్ ముంజాల్, దయానంద్, సత్యానంద్, ఓం ప్రకాష్ సోదరులు సైకిళ్ల తయారీ నుంచి కొంత కాలానికి మోపెడ్ల రంగంలోకి అడుగుపెట్టారు. అప్పట్లో హీరో మెజెస్టిక్ పేరుతో తయారైన ఈ మోపెడ్‌ల లుక్ అందరికీ నచ్చాయి. అలా ఆనాటి మోపెడ్ మార్కెట్లో లూనా, టీవీఎస్‌లతో హీరో పోటీపడింది. అయితే ముంజాల్ సోదరులు ఇక్కడితో ఆగిపోకుండా 1984లో మోటార్ బైక్స్ చేయాలనే సంకల్పంతో జపాన్ కంపెనీ అయిన హోండా మోటార్స్‌తో జతకట్టారు.

అయితే 2010 నాటికి కుటుంబ వ్యాపారం నాలుగు భాగాలుగా విడిపోయింది. అలా హోండాతో ఉన్న జాయింట్ వెంచర్ స్వాధీనపరుచుకున్న బ్రిజ్మోహన్ కుటుంబం.. 2011లో హోండాతో విడిపోయింది. ఆ తర్వాత 2015లో బ్రిన్మోహన్ తన 92వ ఏట కన్నుమూశారు. ప్రస్తుతం పెద్ద కుమారుడు పవన్ ముంజాల్ హీరో మోటార్ కార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హోల్ టైమ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఈయన నేతృత్వంలో ముందుకెళుతున్న హీరో మోటార్ కార్ప్ ప్రస్తుత మార్కెట్ క్యాప్ రూ.79,755 కోట్లుగా ఉంది. ప్రస్తుతం హీరో గ్రూప్ దేశంలోనే అతిపెద్ద టూవీలర్ తయారీ దారుగా, ప్రపంచంలోనే నంబర్-1 మోటార్‌సైకిల్ సంస్థగా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications