Success Story: విజయం సాధించాలనే పట్టుదల ఉంటే చాలా పెద్దపెద్ద డిగ్రీలు అక్కర్లేదని ఈ వ్యక్తి సక్సెస్ స్టోరీని చూసినప్పుడు అనిపిస్తుంది. పేరుకి కాలేజీ డ్రాపౌట్ కానీ దేశంలో అగ్రగామి వ్యాపారవేత్త.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది RG చంద్రమోగన్ విజయం గురించే. 1970లో తన చిన్న ఐస్ క్రీం వెంచర్‌ను ప్రారంభించిన ఆయన నికర విలువ ప్రస్తుతం రూ.19,077 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం ఆయన హట్సన్ అగ్రో ప్రొడక్ట్ లిమిటెడ్ చైర్‌పర్సన్ గా కొనసాగుతున్నారు. ఆయన కుమారుడు సి సత్యన్ హట్సన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ విక్రయాల ద్వారా దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ డెయిరీ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. దీంతో ఆయన అత్యంత ధనిక ఐస్ క్రీమ్ తయారీదారుగా నిలిచారు.

చంద్రమోగన్ చిన్నతనం తమిళనాడులోని చెన్నైలో గడిచింది. ఆయన తండ్రి చిన్న ప్రొవిజన్ షాపు యజమాని. నంబర్లపై అతనికి ఉన్న కమాండ్ కారణంగా అప్పట్లో మానవ కంప్యూటర్ అని పిలిచేవారు.చాలీ చాలని రూ.65 జీతంతో టింబర్ డిపోలో ఉద్యోగిగా తన కెరీర్‌ను చాలా కింది స్థాయి నుంచి ఆయన ప్రారంభించారు.
ప్రస్తుతం కంపెనీ దేశవ్యాప్తంగా 10,000 గ్రామాల్లోని 7.15 లక్షల మంది రైతుల నుంచి పాలను సేకరిస్తోంది. ఈ క్రమంలో 42 కంపెనీలకు తన పాల పదార్థాలను, ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. కేవలం ముగ్గురు కార్మికులతో మెుదట్లో తన ఐస్ క్రీం వ్యాపారాన్ని ప్రారంభించారు. అతను తన ఐస్‌క్రీమ్‌లను 15 తోపుడు బళ్లపై విక్రయించేవారు. ఇందుకోసం మెుదట్లో రూ.13,000తో వ్యపారాన్ని ప్రారంభించారు. 1981లో అరుణ్ ఐస్‌క్రీమ్‌ను ప్రారంభించి గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించారు. వీరి యాజమాన్యంలోని ఆరోగ్య బ్రాండ్ పాల ఉత్పత్తులు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.


Click it and Unblock the Notifications