Success Story: చదువుకోసం లండన్ వెళ్లి వ్యాపార అవకాశాన్ని పట్టిన కుర్రోడు.. డబుల్ ప్రాఫిక్ స్టోరీ
Harshit Godha Success: నేటి కాలంలో యువత తమ సక్సెస్ కోసం ఒక్క చిన్న అవకాశాన్ని సైతం విడిచిపెట్టడం లేదు. తమ కాళ్లపై తామే నిలబడాలనే ఆలోచనతో నచ్చిన పనిపై దృష్టి సారించి విజయతీరాలకు చేరుతున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది చదువుకోసం లండన్ వెళ్లి కొత్త వ్యాపార ఆలోచనతో ఇండియాకు వచ్చిన కుర్రోడు హర్షిత్ గోధా గురించే. బీబీఏ చదువుతున్న క్రమంలో హర్షత్ లండన్ వెళ్లాడు. ఆ సమయంలో అవకాడో తింటుండగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించాడు. వాటిని ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలుసుకున్నాడు. ఈ అవకాడోల ప్రత్యేకతతో పాటు వాటి సాగు పద్ధతులను అర్థం చేసుకోవడానికి ఇజ్రాయెల్ రైతులతో పాటు అవకాడో నిపుణులను సంప్రదించడం ప్రారంభించాడు. వాటి ప్రత్యేక నాణ్యత వల్లే లండన్ ఇంజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు గమనించాడు.

భోపాల్‌కు చెందిన హర్షిత్ 22 ఏళ్ల యువకుడు బీబీఏ చదువుతున్న క్రమంలో తన ఇంటర్న్‌షిప్ విడిచిపెట్టి ఇజ్రాయెల్ అవకాడో వ్యవసాయం గురించి తెలుసుకోవడానికి ఇజ్రాయెల్‌కు వెళ్లాడు. కొన్ని రోజుల నేర్చుకున్న తర్వాత లండన్‌కు తిరిగి వచ్చి తన విద్యను పూర్తిచేశాడు. తర్వాత ఇండియా తరిగివచ్చి దేశంలో ఇజ్రాయెలీ అవకాడోలను పండించడంపై దృష్టి సారించాడు. ఈ ప్రయాణంలో 2019 సమయంలో హర్షిత్ భోపాల్‌లో ఇండో ఇజ్రాయెల్ అవకాడో అనే తన అగ్రి-స్టార్టప్‌ను ప్రారంభించాడు. దీనికోసం రూ.50 లక్షలు వెచ్చించి 5 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, దానిని హైడ్రోపోనిక్ సిస్టమ్‌తో కూడిన పాలీహౌస్‌గా, ఆవకాయ నర్సరీగా మార్చాడు. ఈ క్రమంలో మెుక్కలను ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకోవటాని కరోనా మహమ్మారి అడ్డంకిగా మారింది.
అయితే ఇంపోర్ట్ పర్మిట్ పొందడానికి చాలా సమయం పట్టడంతో మొక్కలు రవాణా చేయడానికి చాలా పెద్దవిగా మారాయి. దీంతో షిప్పింగ్ ఖర్చు ఐదు నుంచి ఆరు రెట్లు పెరిగాయి. అలా 2021లో హర్షత్ 20,000 మెుక్కలను దిగుమతి చేసుకున్నాడు. భోపాల్ విమానాశ్రయం దగ్గరలోని ఐదెకరాల స్థలంలో తన అవకాడో తోటను ప్రారంభించాడు. దీనికి తోడు రైతులకు మెుక్కలను విక్రయించటం మెుదలుపెట్టాడు. వారికి మెుక్కల నాటడం నుంచి దిగుబడి వరకు అన్ని వేళలా ఉచితంగా సపోర్ట్ అందిస్తున్నాడు. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో సహా వివిధ రాష్ట్రాల్లోని రైతులకు మొక్కలను విక్రయించాడు. రానున్న కాలంలో తన సాగును 100 ఎకరాలకు విస్తరించాలని ప్లాన్ చేస్తున్నాడు.

ప్రస్తుతం తన 5 ఎకరాల తోట నుంచి ఏటా రూ.50 లక్షలు ఆర్జిస్తున్నాడు. అలాగే మెుక్కలను అమ్మటం ద్వారా రూ.కోటి సంపాదిస్తున్నాడు. 28 ఏళ్ల హర్షిత్ భోపాల్‌లోని న్యాయవాదుల కుటుంబం నుంచి వచ్చినప్పటికీ సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచనతో కొనసాగుతున్నాడు. భవిష్యత్తులో తోట ద్వారా ఏటా రూ.10 కోట్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నాడు. ఇక నుంచి అవకాడో మొక్కలతో పాటు హర్షిత్ భారతదేశం అంతటా రిటైల్, హోల్‌సేల్ మార్గాల ద్వారా అవకాడో పండ్లను కూడా విక్రయించనున్నారు.


Click it and Unblock the Notifications