Success Story: రూ.10 వేల నుంచి కోట్ల టర్నోవర్ కంపెనీగా పయనం.. సక్సెస్ అంటే ఇదేగా..
Success Story: ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదగాలంటే అంత సులువు అస్సలు కాదు. ఎన్నో ఆలోచనలు మరెన్నో అనుభవాల సమ్మేళనాన్ని కలిపి జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లనప్పుడే ఆచరణ నిజరూపం దాల్చుతుంది.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది వికాస్ డి నహర్ స్థాపించిన హాపీలో కంపెనీ విజయగాథ గురించే. దాదాపు 20 వ్యాపార ఆలోచనలపై పనిచేసి విఫలమైన తర్వాత పుట్టిన వ్యాపార ఆలోచన విజయవంతం అయ్యింది. ఈ ప్రయాణంలో చాలాసార్లు విఫలమైనప్పటికీ అతను తన ధైర్యాన్ని ఏమాత్ర కోల్పోకపోవటం విశేషం. అయితే చివరిగా అతని పోరాటం ఫలించింది.

వికాస్ కుటుంబం కాఫీ, ఎండుమిర్చి వ్యాపారంలో ఉండేది. దీంతో వ్యాపారంపై మక్కువతో సొంత వెంచర్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. అవును అనేక ప్రయత్నాల తర్వాత రూ.10,000 పెట్టుబడితో మెుదలు పెట్టిన హాపీలో ప్రస్తుతం దాదాపు రూ.500 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీగా మారింది.
వాస్తవానికి కంపెనీ డ్రై ఫ్రూట్స్ వ్యాపారంలో విజయవంతంగా ముందుకు సాగుతోంది. 2005లో బెంగుళూరు విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి, జైన్ గ్రూప్‌లో సీనియర్ ఇంపోర్ట్ మేనేజర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత సింబయాసిస్ విశ్వవిద్యాలయం నుంచి MBA డిగ్రీని పూర్తి చేశాడు.

ఎంబీఏ తర్వాత సాత్విక్ స్పెషాలిటీ ఫుడ్‌లో మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన క్రమంలో పొందిన అనుభవం ఆయన జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది. దీంతో 2016లో ఇద్దరు ఉద్యోగులతో వికాస్ హాపీలో కంపెనీకి సహవ్యవస్థాపకుడిగా మారారు. నాణ్యమైన ఉత్పత్తులను కస్టమర్లకు అందించటంపై ఎక్కువగా దృష్టి సారించాడు.
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో సహా అనేక ఈ-కామర్స్ సైట్‌లలో 40 రకాల డ్రై ఫ్రూట్స్, 60 రకాల మసాలా దినుసులతో పాటు 100 రకాలకు పైగా చాక్లెట్లను కంపెనీ విక్రయిస్తూ పేరుగాంచింది. అలా కొనుగోలుదారులకు చేరువైన కంపెనీ టర్నోవర్ ఏకంగా రూ.500 కోట్ల మార్కును దాటడం విశేషం.


Click it and Unblock the Notifications