Success Story: గుజరాతీలు ఏ వ్యాపారం చేసినా అందులో మంచి ఆదాయాలను ఆర్జిస్తారని తెలుసు. జీవితం అందించిన వైఫల్యాల నుంచి చాలా మంది అనుకోకుండా వ్యాపారవేత్తలుగా మారుతుంటారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది రమేష్ రూపరేలియా జీవితం గురించే. అప్పుల భారం, తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా ఆవుల పెంపకం వైపు మళ్లి నేడు పాల వ్యాపారం చేస్తూ ఏడాదికి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో గుజరాత్‌లోని ప్రసిద్ధ పాల వ్యాపార సంస్థల్లో శ్రీ గిర్ గౌ కృషి జతన్ సంస్థగా పేరుగాంచింది. కేవలం 7వ తరగతి వరకు చదువుకున్న రమేష్ తండ్రి సలహా మేరకు ఈ దారిని ఎంచుకున్నాడు. అయితే కోటి ఆశలతో ప్రారంభించిన వ్యాపారం విఫలం కావటంతో వారి కుటుంబం అప్పులపాలైంది.

ఈ పరిస్థితుల్లో వేసిన ఉల్లి పంట మంచి దిగుబడిని అందించటంతో రూ.35 లక్షలు ఆదాయం పొందాడు. అయితే తనకు ఇష్టమైన ఆవుల వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించాడు. చివరికి కొన్ని గిర్ ఆవులను కొనుగోలు చేసి శ్రీ గిర్ గౌ కృషి జాతన్ సంస్థను స్థాపించాడు. గిర్ ఆవు పాలు విక్రయిస్తుండగా.. వాటి వాసనపై వినియోగదారులు ఫిర్యాదు చేయటంతో రూటు మార్చి నెయ్యి తయారు చేయటం ప్రారంభించాడు.

తయారు చేసిన నెయ్యిని ప్లాస్టిక్ సంచుల్లో, గాజు సీసాల్లో పెట్టి అమ్మి సైకిల్ పై తీసుకెళ్లేవాడు. తన నెయ్యి ఉత్పత్తులకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో నెయ్యి వ్యాపారాన్ని విజయవంతంగా ముందుకు సాగించాడు. మంచి క్లయింట్ నెట్‌వర్క్‌ను కూడా పొందాడు. అలా నెయ్యి ధర కేజీకి రూ.250 నుంచి రూ.2.5 లక్షల వరకు వెళ్లడం మెుదలైంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 123 దేశాలకు నెయ్యిని ఎగుమతి చేస్తూ ఏటా రూ.8 కోట్లను సంపాదిస్తున్నాడు. పైగా ఈ రంగంపై ఆసక్తి ఉన్న యువతకు రమేష్ ఆవుల పెంపకం, నెయ్యి తయారీపై శిక్షణ కూడా అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications