Success Story: భార్య మాట విన్న భర్త.. ప్రతి రోజూ రూ.5 కోట్లు సంపాదన.. షాకింగ్ స్టోరీ..
Success Story: ప్రతి వ్యక్తి జీవితంలో విజయం లేదా ఓటమి వెనుక ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. చాలా మంది విజయవంతమైన మగవారి జీవితంలో ఖచ్చితంగా మహిళ పాత్ర ఉంటుందని మరో సారి రుజువైంది.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది ప్రపంచంలో దిగ్గజ టెక్ కంపెనీగా ఉన్న గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెచ్ సీఈవో సుందర్ పిచాయ్ గురించి. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన పేర్లలో నిస్సందేహంగా ఒకరు. 2022లో ఆయన 22.6 కోట్ల అమెరికన్ డాలర్లను వేతనంగా అందుకున్నారు. అంటే రోజుకు సుమారు రూ.5 కోట్లను జీతంగా పొందారు. స్టాక్ ఆప్షన్ల రూపంలో పిచాయ్ రూ.1,788 కోట్లను అందుకున్నారు.

జూన్ 10, 1972లో తమిళనాడు మధురైలో జన్మించిన సుందర్ పిచాయ్ చెన్నైలో పెరిగారు. ఐఐటీ నుంచి బీటెక్ పూర్తి చేసిన పిచాయ్ తదుపరి చదువుల కోసం స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్లారు. అతను అమెరికాలోని వార్టన్ స్కూల్ నుంచి MBA పూర్తి చేశారు. ఆ తర్వా 2004లో గూగుల్‌లో చేరారు. కానీ ఆయన విజయం వెనుక భార్య అంజలి పిచాయ్ ముఖ్యమైన పాత్ర పోషించిందని మనలో చాలా మందికి తెలియదు. అంజలి సలహాను పాటించటం వల్లే 2019లో గూగుల్ సీఈవోగా నియమితులై గుర్తింపు పొందారు.

అంజలి-సుందర్ పరిచయం IIT ఖరగ్‌పూర్‌లో జరిగింది. అంజలి స్వస్థలం రాజస్థాన్‌లోని కోట. 1993లో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఆమె తండ్రి కోటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్యోగి. అంజలి, సుందర్ పిచాయ్ కాలేజీలోనే నిశ్చితార్థం చేసుకున్నారు. అంజలి 1999 నుంచి 2002 వరకు యాక్సెంచర్‌లో పనిచేసింది. నివేదికల ప్రకారం మైక్రోసాఫ్ట్‌లో చేరడానికి సుందర్ పిచాయ్ గూగుల్‌ను విడిచిపెట్టాలని ఆలోచిస్తున్న సమయంలో భార్య అంజలి అతడిని గూగుల్‌లోనే కొనసాగమని సలహా ఇచ్చింది. ఇది నిజంగా పిచాయ్ జీవితాన్ని ఊహించని విజయానికి తీసుకెళ్లింది.


Click it and Unblock the Notifications