Success Story: చిన్న ఫ్లాట్ నుంచి ప్రారంభమైన వ్యాపారం.. రూ.3 లక్షల కోట్ల కంపెనీ విజయగాథ..
Success Story: ఒక వ్యాపారవేత్తగా విజయం సాధించాలనే కోరిక, ఆశయం కలగటం దానిని సాధించటం అంత సులువేమీ కాదు. అయితే చేసే పనిలో నిబద్ధత, అదే దారిలో ఒడిఒడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగితే విజయం తద్యమనేది నమ్మకతప్పని నిజం.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఫ్లిప్‌కార్ట్ మాజీ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ గురించే, దిల్లీ ఐఐటీలో విద్యను అభ్యసించిన ఆయన బిలియన్ డాలర్ల ఈ-కామర్స్ వ్యాపారాన్ని నిర్మించారు. తొలుత చిన్నగా తాను నివసిస్తున్న ఫ్లాట్ నుంచి దీనిని ప్రారంభించారు. 2018లో కంపెనీ విలువ 20.8 బిలియన్ డాలర్లుగా ఉంది. వాల్‌మార్ట్ ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు తర్వాత ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా తన పదవికి రాజీనామా చేరారు.

సచిన్ ఆగష్టు 5, 1981న చండీగఢ్‌లో జన్మించారు. చిన్న ప్రారంభం నుంచి భారతీయ ఈ-కామర్స్ ముఖచిత్రాన్ని మార్చే వరకు చాలా దూరం ప్రయాణించారు. ఐఐటీ దిల్లీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో డిగ్రీని పొందారు. మెుదటి నుంచి టెక్నాలజీ, సాంకేతికత, ఆవిష్కరణలపై ఎక్కువ మక్కువతో సచిన్ ఉండేవారు. ఆన్‌లైన్ బుక్ షాప్ ఫ్లిప్‌కార్ట్‌ను 2007లో బిలియనీర్ స్నేహితుడు, మాజీ అమెజాన్ ఎగ్జిక్యూటివ్ సచిన్ బన్సాల్ స్థాపించారు. సుమారు రూ.5 లక్షల మూలధన పెట్టుబడితో దీనిని ప్రారంభించారు.
గూగుల్ నుంచి రెండు తిరస్కరణల తర్వాత ఫ్లిప్‌కార్ట్‌ను స్థాపించడానికి ముందు బిన్నీ బన్సాల్ అమెజాన్‌లో తొమ్మిది నెలలు పనిచేశారు. దేశంలో ఈకామర్స్ కార్యకలాపాలు పెద్దగా లేని 2007లో అమెజాన్ నుంచి రాజీనామా చేసి సొంతంగా Flipkart అనే ఆన్‌లైన్ రిటైలర్‌ను ప్రారంభించారు. చివరికి ఫ్లిప్‌కార్ట్‌లో 77% వాటాను.. వాల్-మార్ట్ 16 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఫోర్బ్స్ ప్రకారం సచిన్ బన్సాల్ నికర విలువ 1.3 బిలియన్ డాలర్లుగా ఉంది.


Click it and Unblock the Notifications