Rajaram Tripathi Success: చేసే పనిపై ఇష్టం ఉండాలే కానీ దానిలో ఎంత రిస్క్ కష్టం ఉన్నా పర్లేదని నేటి తరం యువత భావిస్తున్నారు. దీనికి తోడు స్టార్టప్ కల్చర్ వేగంగా విస్తరిస్తున్న వేళ లెట్స్ ట్రై న్యూ థింగ్స్ బ్రో అన్నట్లుగా యువత తమ కలలకు వాస్తవరూపం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో మనం తెలుసుకోబోతున్నది రాజారామ్ త్రిపాఠి సక్సెస్ స్టోరీ గురించే. ప్రస్తుతం ఆయన దేశంలోనే సంపన్న రైతుల్లో ఒకరుగా గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే రైతుగా మారటానికి ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న స్థిరమైన, గౌరవప్రదమైన ఉద్యోగానికి 1998లో రాజీనామా చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన రాజారాం త్రిపాఠి కుటుంబం కొన్నేళ్లుగా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో స్థిరపడింది. ప్రస్తుతం రాజారామ్ ఛత్తీస్‌గఢ్ కేంద్రంగా మా దంతేశ్వరి హెర్బల్ గ్రూప్ పేరుతో కంపెనీని స్థాపించి దానికి సీఈవోగా వ్యవహరిస్తున్నాడు. ఈ సంస్థ అక్కడ స్థానికంగా 400 మంది రైతులతో భాగస్వామ్యం కుదుర్చుకుని అధిక విలువ కలిగిన అధిక విలువైన ఔషధగుణాలుంటే మెుక్కల పెంపకాన్ని చేపడుతోంది.

ఈ క్రమంలో దాదాపు 1000 ఎకరాల విస్త్రీర్ణంలో మిరియాలు, ముస్లీ వంటి పంటలను పండిస్తున్నారు. దీంతో స్థానిక రైతులు ఏటా రూ.25 కోట్ల వరకు సంపాదిస్తున్నారు. రాజారామ్ కంపెనీ ఈ ఉత్పత్తులను అమెరికా, యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేస్తోంది. వ్యవసాయంపై మక్కువ ఉన్న త్రిపాఠి 7 ఏళ్ల వయస్సులోనే తన తాతతో కలిసి పొలానికి వెళ్లేవాడు. అలా కేవలం 5 ఎకరాల్లో వ్యవసాయం కొనసాగించేది త్రిపాఠి ఫ్యామిలీ. తండ్రి కాలేజ్ ప్రొఫెసర్ కావటంతో ఆ తర్వాత ఉద్యోగంలోకి వెళ్లిపోయాడు రాజారామ్. అయితే తనలో ఉన్న రైతు దీనిని ఎక్కువ కాలం కొనసాగించనివ్వలేదు. అలా రాజీనామా ఆమోదానికి 2 ఏళ్లు పట్టినప్పటికీ ఏడేళ్ల సర్వీస్ వదులుకున్నాడు.
వ్యవసాయం మెుదలుపెట్టిన కొత్తలో త్రిపాఠి టమాటా, క్యాబేజ్ వంటి కూరగాయలు పండించి మంచి లాభాలను చూశాడు. అలా ఎండుమిర్చి, ముస్లి సాగులోకి అడుగుపెట్టాడు. దీని తర్వాత మిరియాలు, వైట్ ముస్లి, అశ్వగంధ, కల్మేఘ్, ఇన్సులిన్ ట్రీ, స్టెవియా, ఆస్ట్రేలియన్ టేకు, పిప్పాలి వంటి 22 మూలికలను పండించడం స్టార్ట్ చేశాడు. దీనికోసం అవసరమైన పెట్టుబడిని బ్యాంక్ నుంచి రుణం రూపంలో పొందాడు. ప్రస్తుతం రాజారామ్ దాదాపు వెయ్యి ఎకరాల భూమిని కలిగి ఉన్నారు. భారత ప్రభుత్వం నుంచి వ్యవసాయంలో చేసిన కృషికి మూడుసార్లు ఉత్తమ రైతు అవార్డును అందుకున్నాడు.
వ్యవసాయ సామర్థ్యాన్ని పెంచేందుకు రాజారామ్ తన విశాలమైన పొలాల్లో ఎరువులు, పురుగుమందులను పిచికారీ చేసేందుకు వీలుగా రాబిన్సన్ R-44 హెలికాప్టర్ కొనుగోలు చేశాడు. దీని విలువ దాదాపు రూ.7 కోట్లు కావటం గమనార్హం. సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళుతూ స్థానిక గిరిజన సంఘాటలకు మేలు కలిగించాడు. ఆయనను చాలా మంది హెలికాఫ్టర్ రైతు అని పిలుస్తుంటారు.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications