Success Story: చదివింది 10వ తరగతే.. చుమ్మ రూ.5 కోట్లు సంపాదిస్తున్న వ్యక్తి.. మామూలు సక్సెస్ కాదు
Madhusudan Dhakad Success: ప్రస్తుత కాలంలో లక్షల్లో వేతనాలు తీసుకుంటున్న వ్యక్తులు సైతం చాలా మంది సక్సెస్ స్టోరీలు చూసి ఇన్ స్పైర్ అవుతున్నారు. దీనికి తోడు యువత సైతం ఒకరి కింద పనిచేయటానికి బదులుగా తమకు నచ్చిన వ్యాపారం లేదా పనిని చేయాలని ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. దీంతో ఇష్టంతో చేసే పనిలో కష్టం ఉండదు అన్నట్లుగా కృషితో విజయతీరాలకు చేరుకుంటున్నారు.
చదివింది కేవలం పదోతరగతే అయినా కోటీశ్వరుడు. ఈ రోజుల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్న వారు అందుకుంటున్న వార్షిక ప్యాకేజీల కంటే ఎక్కువ సంపాదిస్తున్న వ్యక్తి విజయగాథ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాకు చెందిన వ్యక్తి మధుసూదన్ ధాకడ్. వ్యవసాయంపై మక్కువ ఉన్న ఆయన తనకున్న ప్యాషన్‌తో వినూత్నంగా సాగును కొనసాగించాడు. వ్యవసాయ కుటుంబంలో పెరిగిన మధుసూదన్ మొదట్లో తన అభిరుచితో సంప్రదాయ వ్యవసాయాన్ని అనుసరించాడు. అయితే వీటి వల్ల ఊహించిన స్థాయిలో ఆదాయం రాదని గ్రహించిన మధుసూదన్ రూటు మార్చారు.

అలా ఉద్యానవన పంటలైన వెల్లుల్లి, మిర్చి, క్యాప్సికం, టమాటా, అల్లం వంటి అధిక విలువ కలిగిన పంటలను పండించటంపై దృష్టి సారించారు. వీటిలో సాంప్రదాయ పద్ధతలుకు బదులుగా ఆధునికతలను మిళితం చేసి ముందుకు సాగారు. అలా తన వ్యవసాయాన్ని ఏకంగా 200 ఎకరాలకు విస్తరించాడు. ఈ క్రమంలో అధిక దిగుబడినిచ్చే పంటలను పండించడంతో పాటు.. ఏటా 20 లక్షల మొక్కలతో తన స్వంత నర్సరీని నిర్వహించటం స్టార్ట్ చేశారు. దీంతో ఆయన ఆదాయం ఏడాదికి రూ.5 కోట్లకు చేరుకుంది. మధుసూదన్ కృషి వేల మంది తర్వాతి తరం రైతులకు ఆదర్శంగా నిలవటంతో పాటు వారికి మార్గనిర్థేశం చేసింది. అలా తన విజయం ద్వారా మధుసూదన్.. సరైన పద్ధతిలో, దృఢ సంకల్పం, విజన్‌తో రైతులు తమ చదువుకు సంబంధం లేకుండా గొప్ప ఎత్తులకు చేరుకోగలరని నిరూపించారు.
ఇలాంటి టెక్నిక్స్ వల్ల అధిక పంట దిగుబడి, బహుళ రాష్ట్రాల్లో పంపిణీ అతని వ్యవసాయాన్ని ఔత్సాహిక రైతులకు ఒక నమూనాగా మార్చింది. అలా పచ్చిమిర్చి 40 ఎకరాల సాగు చేస్తూ ఎకరానికి రూ.70 వేల పెట్టుబడితో.. 150-200 క్వింటాళ్ల దిగుబడిని సాధించారు. అలాగే క్యాప్సికం 25 ఎకరాల్లో సాగుచేస్తూ లక్ష ఎకరానికి సాగు పెట్టుబడితో 300-400 క్వింటాళ్ల దిగుబడిని సాధించారు. ఇక్కడ ఆయన ఎకరానికి పెట్టిన పెట్టుబడిపై దాదాపు 5-6 రెట్లు రాబడిని అందుకుంటూ మంచి ఆదాయం పొందారు. ఇదే క్రమంలో టొమాటో సాగు విషయానికి వస్తే 50 ఎకరాల్లో ఎకరాకు లక్ష పెట్టుబడితో 1000-1200 క్వింటాళ్ల దిగుబడి తీస్తూ రూ.3 లక్షల వరకు ఆదాయం పొందినట్లు వెల్లడించారు. ఇక 15 ఎకరాల వెల్లుల్లి సాగుతో పాటు అల్లం కూడా పండిస్తూ తన ఆదాయాన్ని భారీగా పెంచుకున్నారు.
తన రక్తంలో వ్యవసాయం ఉదని, అయితే వేగంగా మారిపోతున్న ప్రపంచంతో పాటు ముందుకు సాగాలంటే మనం కూడా దానికి తగినట్లుగా మారాల్సిందేనని మధుసూదన్ చెబుతుంటారు. ఈ క్రమంలో విద్య ముఖ్యమైనదేనన్న ఆయన అయితే అదే జీవితం మెుత్తం కాదని అంటున్నారు. కేవలం సమయంతో పాటు మార్పులకు మనం సిద్ధంగా ఉంటే సరిపోతుందని అప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications