Shouvik Dhar Success: నేటి కాలంలో చాలా మంది తమకు నచ్చిన ఫుడ్ బిజినెస్ చేస్తూ లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ రేసులో డీఆర్డీఓ సైంటిస్ట్ ఒకరు కూడా ప్రస్తుతం చేరిపోయారు. రుచికరమైన మోమోస్ తయారు చేస్తూ ఏటా కోట్లలో ఆదాయాన్ని పొందుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
మోమోస్‌కు హైదరాబాద్‌లోని షౌవిక్ థార్ బానిస. అతను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పట్టభద్రుడయ్యారు. తనకు ఇష్టమైన సూపీ మోమోస్ స్టోర్లలో అందుబాటులో లేకపోవడంతో వాటిని స్వయంగా తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు.

అసోంలోని సిల్సార్‌లో పుట్టి పెరిగిన షౌవిక్ థార్ ఇంజనీరింగ్ చదివి DRDOలో శాస్త్రవేత్తగా పనిచేశాడు. తర్వాత ఆ ఉద్యోగాన్ని వదులుకుని హైదరాబాద్‌లో జోమోస్ బ్రాండ్‌తో మోమోలను తయారు చేసి విక్రయించేందుకు ప్రభాతి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రారంభించాడు. అతని మోమోలు వేలాది మంది కస్టమర్లను ఆకర్షించాయి. షౌవిక్ 2016లో మొదటి స్టోర్‌ను ప్రారంభించగా.. వేగంగా ప్రజాదరణ పొందటంతో తర్వాతి కాలంలో మరిన్ని దుకాణాలను ఓపెన్ చేశాడు.
ఒక ప్రముఖ సినిమా థియేటర్ చైన్ ఒక సంవత్సరంలో చాలా మంది కస్టమర్లను సంపాదించిన తర్వాత షౌవిక్‌ను సంప్రదించి. తమ థియేటర్లలో మోమోలను విక్రయించమని కోరింది. అప్పటి నుంచి హైదరాబాద్, విజయవాడ, కేరళలోని థియేటర్లలో షౌవిక్ తన మోమోలను విక్రయించటం ప్రారంభించారు.ఈ క్రమంలోనే మోమోస్ కు డిమాండ్ పెరగటంతో వాటి తయారీ కోసం కొత్త యంత్రాన్ని నిర్మించాలనుకున్నాడు. అలా చైనా, కొరియా వంటి దేశాలను సందర్శించి కూరగాయలు కోయటం దగ్గరి నుంచి మోమోస్ కోసం పిండి పిసకటం వరకు పనిని పూర్తిగా చేసే యంత్రాన్ని రూపొందించాడు.
తాను స్వయంగా తయారు చేసుకున్న యంత్రాలను మోమోస్ ఉత్పత్తి కేంద్రాల్లో అమర్చాడు. ఇవి గంటకు దాదాపు 8000 మోమోస్ తయారు చేశాయి. రోజూ యంత్రాలతో షౌవిక్ 2.25 లక్షల మోమోస్ తయారు చేశారు. దీంతో ప్రస్తుతం సైంటిస్ట్ మోమోస్ విక్రయిస్తూ ఏడాదికి రూ.25 కోట్లు ఆదాయంగా పొందుతున్నారు. తెలంగాణతో పాటు కేరళలో జోమోజ్ మోమోస్‌కు డిమాండ్ అధికంగా ఉంది.


Click it and Unblock the Notifications