Mani Krishnan Success: ప్రస్తుత కాలంలో యువత చాలా చిన్న వయస్సులోనే తమ వ్యాపార ఆలోచనలకు ప్రాణం పోయటానికి స్టార్టప్ కంపెనీలను స్థాపిస్తున్నారు. అయితే ఆ పరిస్థితులు కొన్ని దశాబ్ధాల కింద లేవు. వేరే వాళ్ల డబ్బులతో రిస్క్ చేసే అంతటి సాహసాలు ఆ కాలంలో ప్రజలు, వ్యాపారవేత్తలు అస్సలు చేసేవారు కాదు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. మారిన కాలానికి సైతం గతకాలంలోని వ్యాపారవేత్తలే మార్గనిర్థిశకులుగా నిలవటం గమనార్హం.
కానీ ఇప్పుడు ఒక వ్యక్తి తన సక్సెస్ స్టోరీతో యువ వ్యాపారవేత్తలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది మణి కృష్ణన్ సుబ్రహ్మణియన్ సక్సెస్ స్టోరీ గురించే. తమిళనాడులోని చిన్న టౌన్ తిరున్వేలిలో ఆయన పుట్టారు. ముంబైలో కొంత కాలం అకౌంటెంట్ జాబ్ చేసిన ఆయన తర్వాత 1977లో అమెరికాలోని సాన్ జోస్ ప్రాంతంలో స్థిరపడ్డారు. అక్కడే ఒక టెక్ కంపెనీలో ఉద్యోగానికి చేరారు. ఆ తర్వాత హార్డ్ డిస్కులు, మథర్ బోర్డులు ఎగుమతిచేయటం ప్రారంభించాడు. ఇదే క్రమంలో అమెరికాలోని భారతీయులు ఇష్టపడే కాఫీతో పాటు ఇడ్లీ, దోశ పిండి తయారీ వ్యాపారంలోకి కూడా దిగారు. ఇంటికి దూరంగా ఉండే ప్రజలు వీరి ఉత్పత్తులను భారీగా ఆదరించటం ప్రారంభించారు.

దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఎక్కువగా ఇడ్లీ, దోశ తినటం సహజమే. అయితే వాటిని తయారు చేసుకునేందుకు ఎక్కువ సమయం పట్టడంతో చాలా మంది ఇబ్బంది పడటాన్ని గమనించి ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేసినట్లు మణి పేర్కొన్నారు. 2003లో ఈ వ్యాపారాన్ని ప్రారంభించిన తొలినాళ్లలో చేతిలో చాలా తక్కువ డబ్బు మిగలటంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమయంలో భార్య ఆనంది ఆయనకు తోడుగా నిలిచి పిండి తయారీ నుంచి లేబులింగ్, పంపిణీ వరకు ప్రతిదానిలోనూ సహాయంగా నిలిచారు. ఉదయాన్నే లేచిన తర్వాత 7 గంటలకల్లా గ్రైండర్ల దగ్గరకు చేరుకుని పిండి తయారు చేయటం ప్రారంభించేవారు. తయారీ తర్వాత వీటిని శాన్ జోస్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని స్టోర్ల యజమానులను ఒప్పించి సేల్ చేయటాన్ని మణి చూసుకునేవారు.
అయితే ఏడాదిలోనే మణి ప్రారంభించిన శాస్థా ఫుడ్స్ తన అన్ని అప్పులను తీర్చేసింది. దీంతో డెలివరీ సిస్టమ్ నుంచి రిఫ్రిజరేటెడ్ ట్రక్కుల వరకు అన్నింటినీ అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం డజనుకు పైగా రిఫ్రిజిరేటెడ్ ట్రక్కులు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. వీటి తయారీ కోసం ముడి సరుకులను ఆఫ్రికా, దుబాయ్, అమెరికా నుంచి కొనుగోలు చేస్తున్నారు. ప్రధాన కార్యాలయంలో ప్రతిరోజూ 12,500 కిలోల పిండిని తయారు చేయబడుతోంది. ఈ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా గంటకు నాలుగు కంటైనర్ల స్టాక్ విక్రయించబడుతోందని వెల్లడైంది. ప్రస్తుతం ప్రంపచవ్యాప్తంగా ఆర్గానిక్ ఉత్పత్తులకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ కారణంగా కంపెనీ 2017లో వీటిని కూడా స్టార్ట్ చేసింది.
ప్రస్తుతం కంపెనీ బ్యాటర్ బిజినెస్ నుంచి పచ్చళ్ల వరకు దాదాపు 600లకు పైగా ఉత్పత్తులను విక్రయిస్తోంది. ప్రస్తుతం చాలా స్టోర్లు ఈ ఉత్పత్తులను విక్రయించటానికి అంగీకరించటంతో వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. వీరి ఉత్పత్తుల్లో కింగ్ దోశ పిండి. కంపెనీ దాదాపు 16 వివిధ రకాల దోశపిండెలను ప్రస్తుతం మార్కెటింగ్ చేస్తోంది. దీంతో అమెరికా, కెనడా వ్యాప్తంగా భారతీయ ప్రజలకు మణి ఉత్పత్తులు రోజువారీ అవసరాలను తీర్చుతున్నాయి.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications