Dinesh Thakkar Success: భారతదేశంలో ప్రస్తుతం పెట్టుబడుల విప్లవం కొనసాగుతోంది. కరోనా తర్వాత స్టాక్ మార్కెట్లను ఒక ఆదాయ వనరుగా దేశంలో చాలా మంది యువత చూస్తున్నారు. దీంతో బ్రోకరేజ్ వ్యాపారంలో ఉండే కంపెనీలకు మంచి కాలం వచ్చింది. ఇదే క్రమంలో చాలా మంది సామాన్యులు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను సైతం ప్రారంభించారు.
ఈ క్రమంలో జెరోధా, గ్రో, ఏంజెల్ వన్, అప్ స్టాక్, మోతీలాల్ ఓస్వాల్ వంటి అనేత దిగ్గజ బ్రోకరేజ్ సంస్థలు భారీగా కస్టమర్లను పొందాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది దేశంలో ప్రముఖ పెట్టుబడి యాప్ ఏంజల్ వన్ వ్యవస్థాపకుడు దినేష్ ఠక్కర్ గురించే. ఆయన చదువుకున్నది కేవలం 12వ తరగతి మాత్రమే. అయితే అత్యంత పోటీ కలిగిఉన్న ఆర్థిక పరిశ్రమలోకి అడుగుపెట్టి అనుకోకుండా ఏంజెల్ బ్రోకింగ్ కంపెనీని ప్రారంభించాడు. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.25,000 కోట్లకు పైగా ఉంది.

వాస్తవానికి ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ కంపెనీని ఠక్కర్ 1996లో స్థాపించారు. ప్రస్తుతం దీని పేరు ఏంజెల్ వన్ లిమిటెడ్ గా మార్చబడింది. కంపెనీ ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ కమోడిటీ ఎక్స్ఛేంజ్ మరియు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లలో సభ్యుడు. ప్రస్తుతం ఇది దేశంలో మూడో అతిపెద్ద బ్రోకింగ్ సంస్థగా కొనసాగుతోంది. ఏంజెల్ వన్ బ్రోకరేజ్ కి 50 లక్షలకు పైగా వినియోగదారులు ఉన్నారు. ఈ యాప్ బ్రోకింగ్, కమోడిటీ ట్రేడింగ్, పెట్టుబడి సలహాలు, పర్సనల్ లోన్స్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్ పంపిణీ వ్యాపారాలను నిర్వహిస్తోంది.
బ్రోకింగ్ సంస్థను స్థాపించి విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్న దినేష్ ఠాక్కర్ ఆస్తి విలువ రూ.3,000 కోట్లుగా ఉంది. ప్రస్తుతం ఆయన వద్ద అద్భుతమైన లగ్జరీ కార్ల కలెక్షన్ కూడా ఉంది. నిన్న స్టాక్ మార్కెట్లు ముగిసే సమయంలో ఏంజెల్ వన్ కంపెనీ షేర్ ధర ఎన్ఎస్ఈలో ఒక్కోటి రూ.2,800 వద్ద ప్రయాణాన్ని ముగించింది. దీంతో ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.25 వేల కోట్లకుపైగానే ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.3,021 కోట్ల ఆదాయంతో రూ.890 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లకు 38.21% షేర్లు, రిటైల్ ఇన్వెస్టర్లకు 35.03% షేర్లు ఉండగా మిగిలిన 17.27% షేర్లు విదేశీ కంపెనీల వద్ద ఉన్నాయి.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications