Diganta Das: నేటి కాలంలో ఇంట్లో వండుకుని తినేంత ఖాళీ ప్రజలకు ఉండటం లేదు. ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది తక్కువ సమయంలో ఇంటి వద్దే వండుకునే ఆహారాల వైపు ఎక్కువగా మెుగ్గుచూపటం కొత్త వ్యాపార ఆలోచనలకు ఆజ్యం పోస్తోంది.
అలా పుట్టిందే డైలీ ఫ్రెష్ ఫుడ్ అనేది ఇంట్లో వేడి చేసి తినగలిగే పరాటాలను విక్రయించే సంస్థ. కంపెనీ యజమాని దికాంత దాస్ 12 ఏళ్ల క్రితం బెంగళూరులోని ఓ హోటల్‌లో సెక్యూరిటీ గార్డుగా రోజుకు రూ.300 వేతనానికి పనిచేశాడు. కానీ తర్వాత సొంతంగా వ్యాపారం ప్రారంభించి లక్షలు సంపాదించాడు. ఆయన కంపెనీ ప్రస్తుతం అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో రోజుకు 2,000 పరాటాలను విక్రయిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతోంది.

దికాంత దాస్ అస్సాంలోని బిస్వనాథ్ జిల్లాలో ఒక పేద కుటుంబంలో జన్మించాడు. ఉద్యోగం వెతుక్కుంటూ 2011లో బెంగళూరుకు వచ్చి ఓ హోటల్‌లో సెక్యూరిటీ గార్డుగా, రూమ్ సర్వీస్ బాయ్‌గా చేరాడు. 2012లో ఇన్‌స్టంట్ ఫుడ్ ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన ఐడీ ఫ్రెష్ పుట్‌లో చేరారు. ఇక్కడ అతని పని సరుకులు లోడ్ చేయడం మరియు అన్‌లోడ్ చేయడం. తర్వాతి కాలంలో పరాఠాలు, చపాతీలు మొదలైనవాటిని ప్రజలకు నచ్చే విధంగా ఎలా తయారుచేయాలో నేర్చుకున్నాడు. సీనియర్ అధికారి సహకారంతో వ్యాపారం, మార్కెటింగ్ అంశాల్లో మెళకువలు నేర్చుకున్నాడు.
అయితే సూర్య అనే స్నేహితుడితో కలిసి మొదట ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో చిన్న పరాటా తయారీ కంపెనీని ప్రారంభించాడు. కానీ కరోనా కాలంలో, కంపెనీని మూసివేయవలసి రావటంతో నష్టం వచ్చింది. దీంతో అసోం తిరిగి వెళ్లిపోయి రోజూ పనికి వెళ్లవలసి వచ్చింది. అయితే పట్టు వదలక మళ్లీ స్నేహితుడు సూర్య, మరో స్నేహితుడు డొంబర్‌తో కలిసి అసోంలో డైలీ ఫ్రెష్ పుట్ అనే కంపెనీని ప్రారంభించారు. ఒక్కొక్కరు ఒక్కో పని చూసుకోవటంతో వారి ఉత్పత్తులకు ప్రజల్లో ఆదరణ పెరిగింది. క్రమంగా కంపెనీ వృద్ధి బాటలో పడటంతో లాభాలను ఆర్జించటం ప్రారంభించారు.
ప్రస్తుతం తన పరాటా తయారీ కంపెనీలో నెలకు రూ.6 లక్షల చొప్పున రోజుకు రూ.20,000 సంపాదిస్తున్నాడు. అంతే కాకుండా ఎంతో మందికి ఉపాధి కూడా కల్పించాడు. తన కంపెనీలో పరాటాలు తయారు చేసి నిల్వ ఉంచడం లేదని, రోజూ వాటిని తయారు చేసి తాజాగా విక్రయిస్తున్నట్లు చెప్పారు. పరాటా తయారీ పని ఉదయం 1 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 4 గంటలకు ముగుస్తుంది. తర్వాత వాటిని ఒక్కో ఊరికి పంపే పని జరుగుతుందని అలా తాజా ఉత్పత్తులను విక్రయించటంతో వారి వ్యాపారం సూపర్ సక్సెస్ అయ్యింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications