Success Story: 10 ఫేమస్ బ్రాండ్స్ సృష్టించి.. రూ.10 వేల కోట్ల కంపెనీకి యజమాని కథ..
Success Story: ప్రజల అవసరాలను గుర్తించి దానిని వ్యాపారంగా తీర్చిదిద్దటంలోనే అసలు విజయం ఉంటుందని మరోసారి రుజువైంది. ప్రస్తుతం దేశంలోని స్టార్టప్ కంపెనీలు చేస్తున్నది కూడా అచ్చం ఇలాంటి ప్రయత్నమే.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఎలాంటి ముందస్తు వ్యాపార జ్ఞానం లేకుండా పెద్ద కంపెనీ సామ్రాజ్యాన్ని సృష్టించిన దర్శన్ పటేల్ గురించే. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించిన తర్వాత సంబల్‌పూర్‌లో పెరిగారు. వీరి కుటుంబం పశ్చిమ ఒడిశాకు చెందినది. ఈయన సోదరులతో కలిసి పరాస్ ఫార్మా, విని కాస్మెటిక్స్ కంపెనీలను స్థాపించారు.

2010లో ఫాగ్ డియోడరెంట్‌ని మార్కెట్లోకి తీసుకొచ్చిన దర్శన్ పటేల్ దాని మార్కెటింగ్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే 53 ఏళ్ల వయస్సులో ఓటమిని అంగీకరించేందుకు ఆయన సిద్ధంగా లేరు. సుమారు 25 సంవత్సరాల పాటు ఆయన మూవ్, ఇట్చ్ గార్డ్, క్రాక్ హీల్ వంటి ప్రజాధరణ పొందిన అనేక ఉత్పత్తులను తీసుకొచ్చారు. అలా పరాస్ ఫార్మాను గొప్ప సంస్థగా మార్చారు. ప్రజల అవసరాలను తెలుసుకుని వాటికి అనుగుణంగా దర్శన్ పటేల్ వారి కోసం నేరుగా ఆచరణాత్మక ఉత్పత్తులను పరిచయం చేసేవారు. తప్పుడు ప్రచారాలతో మార్కెట్లో మనుగడ ఉండదని ఆయన ముందుగానే అర్థం చేసుకున్నారు.
ఒకసారి రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు ఎక్కువ మంది మహిళల కాళ్ల మడమలకు పగుళ్లు గమనించారు. దీంతో ఆడవారి డ్యామేజ్ హీల్స్‌ను రిపేర్ చేసే ఉత్పత్తి తయారు చేయాలని ఆలోచన పుట్టింది. గుజరాతీ వ్యాపారవేత్త దర్శన్ పటేల్ బోర్డ్ రూమ్‌లో కూర్చుంటే వ్యక్తులు బయట ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించలేమని అభిప్రాయడుతుంటారు. ప్రస్తుతం విని కాస్మటిక్స్ విలువ 1.2 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంది. అయితే దర్శన్ పటేల్ 2010లో రూ.3,260 కోట్లకు వ్యాపారాన్ని పరాస్ ఫార్మాస్యూటికల్స్‌కు విక్రయించారు.


Click it and Unblock the Notifications