Success Story: ఒకప్పుడు ఇన్ఫోసిస్‌లో ఆఫీస్ బాయ్.. ప్రస్తుతం రెండు కంపెనీలకు సీఈవో..!!
Success Story: చిన్న ఉద్యోగి స్థాయి నుంచి కంపెనీలను ఏర్పాటు చేసేంత ఎదగటం అంటే అంత సులువు కాదు. ఈ మార్గంలో అనేక అడ్డంకులు ఎదురవుతాయి. ఇప్పుడు అలాంటి వ్యక్తి గురించి తెలుసుకుందాం.
దృఢ సంకల్పంతో అంకితభవంతో పనిచేస్తే విజయం తప్పక వరిస్తుందని దాదాసాహెబ్ భగత్ అనే వ్యక్తి నిరూపించాడు. ఒకప్పుడు ఇతను ఇన్ఫోసిస్ కంపెనీలో ఆఫీస్ బాయ్‌గా పనిచేసేవాడు. ఇన్ఫోసిస్ గెస్ట్ హౌస్‌లో అతిథులకు రూమ్ సర్వీస్, టీ వాటర్ అందించే బాధ్యత అతనిదే. ప్రస్తుతం రెండు స్టార్టప్ కంపెనీలకు సీఈవోగా వ్యవహరిస్తున్నారు. షెడ్ నుండి "మేడ్-ఇన్-ఇండియా" కాన్వాను నిర్మించారు.

భగత్ 1994లో మహారాష్ట్రలోని బీడ్‌లో జన్మించారు. న్నత పాఠశాల పూర్తి చేసిన తర్వాత వృత్తిని కొనసాగించేందుకు తన గ్రామం నుంచి పూణేకు మకాం మార్చాడు. ITI డిప్లొమా ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన తర్వాత రూమ్ సర్వీస్ బాయ్‌గా నెలకు రూ.9,000 జీతానికి ఇన్ఫోసిస్ గెస్ట్ హౌస్‌లో ఉద్యోగిగా చేరాడు. అలా ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నప్పుడు సాఫ్ట్‌వేర్ విలువను తెలుసుకుని పరిశ్రమపై ఆసక్తి పెంచుకున్నాడు. అయితే అందుకు తగిన విద్య తనకు లేదని అతడు గ్రహించాడు. ఆ సమయంలోనే యానిమేషన్, డిజైన్‌ను వైపు అడుగులు వేశాడు.
అలా రాత్రి పూట డ్యూటీ, పగటి పూట యానిమేషన్ నేర్చుకోవటం కొనసాగించాడు. కోర్సు పూర్తయిన తర్వాత భగత్ ముంబైలో "రియల్ టైమ్ ఉద్యోగం" కోసం నియమించబడ్డాడు. ఆ తర్వాత కొంత కాలానికి హైదరాబాద్ కు మకాం మార్చాడు. హైదరాబాద్‌లోని డిజైన్ అండ్ గ్రాఫిక్స్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నప్పుడు పైథాన్, C++ చదవడం ప్రారంభించాడు.

అనేక విజువల్ ఎఫెక్ట్‌లను రూపొందించడానికి చాలా సమయం పడుతుందని, పునర్వినియోగ టెంప్లేట్‌ల లైబ్రరీని సృష్టించడం అద్భుతంగా ఉంటుందని గ్రహించాడు. అలా డిజైన్ టెంప్లేట్‌లను ఆన్‌లైన్‌లో మార్కెట్ చేయడం ప్రారంభించాడు. తర్వాత ఉద్యోగం వీడి Ninthmotion స్థాపించి 6,000 క్లయింట్లను పొందాడు. ఆ తర్వాత కరోనా సమయంలో డూగ్రాఫిక్స్ రూపొందించి విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్నాడు.


Click it and Unblock the Notifications