Success Story: కాలేజ్ విద్య నుంచి డ్రాపౌట్ అయిన చాలా మంది తమ జీవితంలో విజయవంతమైన వ్యాపారాలతో ఉన్నత శిఖరాలకు చేరుకున్నట్లు నిరూపించబడింది. బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్‌తో సహా ప్రపంచంలోని బిలియనీర్లు దీనికి అతిపెద్ద ఉదాహరణలు. అలాగే CRED సృష్టికర్త కునాల్ షా బెంగళూరు నుంచి అలాంటి ఒక ఉదాహరణగా నిలుస్తున్నారు.
విల్సన్ కాలేజీ నుంచి ఫిలాసఫీలో బ్యాచిలర్ డిగ్రీని సంపాదించిన తర్వాత.. కునాల్ 2003లో ఒక మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ కోసం NMIMSలో హాజరయ్యాడు. అతను తన వ్యాపార లక్ష్యాలను అనుసరించడానికి ఏడాది తర్వాత చదువు ఆపేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే క్రెడ్ తో విజయం సాధించటానికి ముందు.. రీఫండ్స్ అందించే PaisaBack అనే సైట్‌ను ప్రారంభించారు. అయితే ఫ్రీఛార్జ్‌ను ప్రారంభించేందుకు దీనిని మూసివేశారు.

2015లో తన చెల్లింపుల యాప్ ఫ్రీఛార్జ్‌ను 450 మిలియన్ డాలర్లకు ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ కు విక్రయించారు. ఆ తర్వాత 2017లో దీనిని యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కానీ 2018లో కునాల్ బెంగళూరు కేంద్రంగా CREDని స్థాపించారు. ప్రత్యేకమైన ఆఫర్‌లు, ప్రీమియం అనుభవాలకు యాక్సెస్‌ను మంజూరు చేయడం ద్వారా ఆన్-టైమ్ క్రెడిట్ కార్డ్ చెల్లింపులు చేసినందుకు ఫిన్‌టెక్ బిజినెస్ CRED మెంబర్‌లకు మాత్రమే సర్వీస్ రివార్డ్ అందిస్తుంది. పైగా ఇది క్రెడిట్ స్కోర్ వివరాలను అందిస్తుంది. క్రెడిట్ కార్డ్ వినియోగదారులను అనేక కార్డ్‌లను నిర్వహించడానికి అనుమతిస్తుంది.
ఇంత పెద్ద ఫిన్ టెక్ కంపెనీని నడుపుతున్నప్పటికీ కునాల్ షా నెలకు రూ.15,000 జీతంగా పొందుతున్నారు. తన బిజినెస్ వెంచర్ లాభదాయకమైనదిగా మారి విజయవంతం అయ్యేంతవరకు సృష్టికర్తగా తన పాత్రకు బాగా చెల్లించాల్సిన అవసరం లేదని ఇన్‌స్టాగ్రామ్ కథనంలో పేర్కొన్నారు. తాను గతంలో విక్రయించిన వ్యాపారం ద్వారా మంచి ఆదాయాన్ని పొందాన్ని.. దానితోనే ప్రస్తుతం జీవితాన్ని గడుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. 2022లో క్రెడ్ ఆదాయం రూ.422 కోట్లకు పెరిగినప్పటికీ.. రూ.1,279 కోట్ల నికర నష్టాన్ని యూనికార్న్ చవిచూసినట్లు వెల్లడైంది. 2021 ప్రారంభంలో కునాల్ షా అంచనా విలువ రూ.15,000 కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications