Success Story: ఎలా సామీ మీకు ఇలాంటి ఐడియాస్ వస్తాయ్.. వేస్ట్ నుంచి ఏటా రూ.75 కోట్లు..!
Anees Ahmed Success: భారతదేశంలో యువత ప్రస్తుతం తమ సృజనాత్మకతకు పదును పెడుతున్నారు. పెద్ద నగరాల్లోని కార్పొరేట్ కంపెనీల చుట్టూ రెజ్యూమ్ పట్టుకుని తిరగటం కంటే సొంతంగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది ఊహించని సక్సెస్ కూడా రుచిచూస్తున్నారు. పైగా వారి ప్రయాణం చాలా మంది కొత్త తరం ప్రజలకు దిశానిర్థేశంగా మారుతోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది చెన్నై కేంద్రంగా గ్లోబల్ గ్రీన్ కోయర్ స్థాపించిన అనీస్ అహ్మద్ సక్సెస్ స్టోరీ గురించే. అతను కొబ్బరికాయల నుంచి వచ్చే వృధాతో వివిధ ఉత్పత్తులను తయారు చేసి ఏకంగా రూ.75 కోట్ల వ్యాపారాన్ని చేస్తున్నాడు. అనీస్ ప్రారంభించిన స్టార్టప్ కంపెనీ వ్యవసాయ అవశేషాలను కోకోపీట్‌గా ప్రాసెస్ చేస్తూ పర్యావరణ అనుకూలమైన నేల ప్రత్యామ్నాయం. ముఖ్యంగా దీనిని అంతర్జాతీయ మార్కెట్‌ల్లో ఉద్యాన, వ్యవసాయంలో విస్తృతంగా ఉపయోగించటంతో భారీగా వినియోగించటంతో వ్యాపారం ఊపందుకుంది.

అయితే మనలో చాలా మందికి అసలు వ్యవసాయంపై అవగాహన లేకపోవటంతో కోకోపీట్ అంటే ఏమిటి అవగాహన చాలా తక్కువ. కొబ్బరికాయ పైన ఉండే పీచు ఉప ఉత్పత్తే కోకోపీట్. సాంప్రదాయ మట్టికి స్థిరమైన ప్రత్యామ్నాయం. ఇది నేల గాలి, ఉత్పత్తిని మెరుగుపరిచేటప్పుడు నీరు, పోషకాలను నిలుపుకోవడం ద్వారా మొక్కల పెరుగుదలను పెంచుతుంది. ఒకప్పుడు వ్యవసాయ వ్యర్థాలుగా పరిగణించబడే, కోకోపీట్ సామర్థ్యాన్ని 1990ల చివరలో డచ్ ఆవిష్కర్తలు మొదట గుర్తించారు. నేడు కొబ్బరి కుండీలు, గ్రో బ్యాగ్‌లు, ఇటుకలు, బ్లాక్‌లు వంటి ఉత్పత్తులను తయారు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా వీటికి అధిక డిమాండ్ ఉంది. పైగా కోకోపీట్ ఉత్పత్తిలో భారతదేశపు అగ్రగామిగా ఉన్న తమిళనాడు.. ప్రపంచ మార్కెట్లకు గణనీయమైన వాటాను సరఫరా చేస్తోంది.

గ్లోబల్ గ్రీన్ కోయిర్ ఒక సాధారణ, వినూత్నమైన ఆలోచనతో ప్రారంభమైంది. వ్యర్థాలను ఉపయోగపడే ఉత్పత్తుల మార్చి అంతర్జాతీయంగా వీటిని సరఫరా చేయాలని అనీస్ అహ్మద్ భావించారు. అలా అనీస్ తమిళనాడు కొబ్బరి పరిశ్రమ అన్‌టాప్ చేయని సామర్థ్యాన్ని అందిపుచ్చుకున్నారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా అధిక-నాణ్యత కోకోపీట్‌ను రూపొందించగా వాటికి భారీగా డిమాండ్ ఉంది. అలా యూరప్ సహా అనేక దేశాలకు ఈ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ ఏడాదికి రూ.75 కోట్ల విలువైన వ్యాపారాన్ని చేస్తున్నారు. ఈ క్రమంలో ముందుగా కొబ్బరికాయ పై తోలును స్థానిక పొలాల నుంచి సేకరించి, ఫైబర్లు, ఆకులు వంటి మలినాలను తొలగించిన తర్వాత సరైన తేమ స్థాయిలకు తీసుకొచ్చి ప్యాక్ చేస్తారు. పైగా ఇవి నేల సారాన్ని, ఆరోగ్యాన్ని పెంచి పంట సారాన్ని పెంచుతాయని వెల్లడైంది.


Click it and Unblock the Notifications